Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
- ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై మౌలానా షహాబుద్దీన్ విమర్శలు
- ముస్లిం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్
- 150 అసెంబ్లీ సీట్లలో ముస్లిం అభ్యర్థులు ఉండాలని డిమాండ్
- తన డిమాండ్లపై స్పందించేందుకు 30 రోజుల గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muslim CM Demand: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న వేళ కొత్త డిమాండ్ తెర పైకి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)పై మౌలానా షహబుద్దీన్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ తరుఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముస్లిం నేతను ప్రకటించాలని డిమాండ్ చేశారు. 150 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం నేతల్ని బరిలోకి దించాలని కోరారు. తన డిమాండ్లపై అఖిలేస్ యాదవ్ స్పందించేందుకు 30 రోజులు టైమ్ ఇచ్చినట్లు చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ముస్లింలు, యాదవుల కన్నా ఎక్కువ ఉన్నారని, అలాంటప్పుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ముస్లింలు 22 శాతం, యాదవులు కేవలం 7 శాతం ఉన్నారు, అలాంటప్పుడు అఖిలేష్ ఎందుకు సీఎం అభ్యర్థి..? అంటూ ప్రశ్నించారు. తన డిమాండ్లపై అఖిలేష్ స్పందించడం లేదని, తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని షహబుద్దీన్ అన్నారు. ఇదే కాకుండా, ఎస్పీకి చెందిన పలువురు నేతలు వక్ఫ్ ఆస్తుల్లో అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై కూడా ఎస్పీ చీఫ్‌ను ప్రశ్నించినా సమాధానం రాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో 150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని అన్నారు. 30 రోజుల్లో తమ డిమాండ్లను అంగీకరించకపోతే అఖిలేష్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించారు.
Also Read
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
తాజావార్తలు
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!