NTV Telugu Site icon

Elon Musk: కాలిఫోర్నియాను విడిచిపెట్టనున్న మస్క్..కారణం ఇదే..

Elon Musk

Elon Musk

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ కాలిఫోర్నియాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. స్పేస్ ఎక్స్ , సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. కాలిఫోర్నియాలో చేసిన చట్టం కారణంగా.. తాను ఈ నగరాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు మస్క్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఏడాది క్రితమే ఈ చట్టం గురించి కాలిఫోర్నియా గవర్నర్‌కు మస్క్ స్పష్టం చేశారు. ఈ చట్టం వస్తే కంపెనీలు, కుటుంబాలు ఈ నగరం నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని గవర్నర్ కు తెలిపారు. అయినా.. నగర పాలక సంస్థ చట్టాన్ని ఆమోదించింది. ఎలాన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం కాలిఫోర్నియా నగరానికి చాలా నష్టం కలిగించనుంది.

READ MORE: Satyakumar: ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన ఏపీ మంత్రి సత్యకుమార్

కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు స్పేస్ ఎక్స్, ఎక్స్ ప్రధాన కార్యాలయాలల్ని బదిలీ చేస్తున్నట్లు పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ తెలిపారు. కాలిఫోర్నియాలోని హతోర్న్‌లో ఉన్న స్పేస్‌ఎక్స్‌ కార్యాలయాన్ని టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌కు, ఎక్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ను కాలిఫోర్నియా నుంచి ఆస్టిన్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ సోమవారం కొత్త చట్టంపై సంతకం చేశారు. ఆ తర్వాత మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల జెండర్‌ గుర్తింపు మార్పుల గురించి తల్లిదండ్రులకు చెప్పకుండా టీచర్లను నిషేధించేలా ఈ చట్టం రూపొందించారు. ఈ రకమైన చట్టాల వల్ల కంపెనీలు మరియు కుటుంబాలు తమ పిల్లల భద్రత కోసం కాలిఫోర్నియాను విడిచిపెట్టవలసి వస్తుందని మస్క్ తెలిపారు. కాగా.. వాహన తయారీ సంస్థ టెస్లా యొక్క కార్పొరేట్ ప్రధాన కార్యాలయం కూడా 2021లో కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో నుంచి ఆస్టిన్‌కు మార్చారు. మస్క్ టెస్లా యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పారిశ్రామికవేత్త తన నివాసాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మార్చినట్లు చెప్పారు. అక్కడ రాష్ట్ర వ్యక్తిగత ఆదాయ పన్ను లేనందునా ఈ నిర్ణయం తీసుకున్నారు.