Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..

Musi

Musi

Hyderabad: హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నదికి వరద నీటి తాకిడి పెరుగుతోంది. ఉపరితలాల నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీ ప్రాజెక్ట్‌ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి, నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు.

తెలంగాణలోని Musi Project (మూసీ రిజర్వాయర్) పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) 645 అడుగులు కాగా, ఆ నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. నగరంలో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నిలకడగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా గరిష్ఠ స్థాయికి చేరువవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం 638 అడుగులకు చేరగా, అందులో నీటి నిల్వ 2.88 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 20 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, నీటిమట్టాన్ని నియంత్రించేందుకు అధికారులు దిగువకు 727 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నీటిని విడుదల చేస్తున్నారు. వర్ష సూచనల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను, నదీ తీర ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.