Murasu Cyclone: మురసు తుఫాన్ బీభత్సం.. ఏపీలో పలు జిల్లాలు జలమయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మురసు’ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తిరువూరులో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. విస్సన్నపేట, ఏ.కొండూరు మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తిరువూరు ఆర్టీసీ డిపో గ్యారేజీలోకి వరద నీరు చేరడంతో కార్మికులు ఇబ్బందులు పడ్డారు. గంపలగూడెం మండలంలోని వినగడప–తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శివారు ప్రాంతాల్లోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు–గంపలగూడెం మధ్య గుర్రపువాగు, తిరువూరు–అక్కపాలెం మధ్య లోలెవల్ వంతెన, లక్ష్మీపురం–మల్లెల గ్రామాల మధ్య జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read
- King 100 Glimpse: ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే నేను..
- IND vs NZ: అర్ష్‌దీప్ దెబ్బకు కివీస్ విలవిల.. ఫీల్డింగ్‌లో మెరిసిన రోహిత్, కోహ్లీ..! టీమిండియా టార్గెట్ ఎంతంటే.?
- US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పియా దండియా రాక్.. వివేక్ రామస్వామికి షాక్..
- US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం..
మురసు తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఏలూరు నగరంలోని ప్రధాన కూడళ్లు జలమయమయ్యాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది. ఏలూరు రిజిస్ట్రార్ కార్యాలయంలోని పాత భవనంలో సుమారు రెండు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాజమహేంద్రవరంలోని ఇందిరానగర్ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వర్షపు నీరు దిగువ ప్రాంతాల్లో నిలిచిపోవడంతో కాలనీలోని వీధులన్నీ నీట మునిగాయి. పలు ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటితో పాటు పాములు, ఇతర విషపురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
తాజావార్తలు
-
King 100 Glimpse: ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే నేను..
-
Murasu Cyclone: మురసు తుఫాన్ బీభత్సం.. ఏపీలో పలు జిల్లాలు జలమయం!
-
IND vs NZ: అర్ష్‌దీప్ దెబ్బకు కివీస్ విలవిల.. ఫీల్డింగ్‌లో మెరిసిన రోహిత్, కోహ్లీ..! టీమిండియా టార్గెట్ ఎంతంటే.?
-
Spain Train Disaster: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 69 మంది మృతి.. రవాణా మంత్రి రాజీనామా!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి