Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!

Rajahmundry Airport

Rajahmundry Airport

Flights Cancelled at Rajahmundry Airport: మురసు తుఫాన్ ప్రభావం విమాన సర్వీసులపై పడింది. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి పలు విమానాల రాకపోకలు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లే నాలుగు విమాన సర్వీసులు, చెన్నైకి వెళ్లే ఒక విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. ముందస్తుగానే ప్రయాణికులకు సమాచారం అందించారు. వరుసగా రెండో రోజు కూడా తుఫాన్ ప్రభావంతో విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది.

మురసు తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రాజమహేంద్రవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌కు వెళ్లే నాలుగు విమాన సర్వీసులతో పాటు చెన్నైకి వెళ్లే ఒక విమాన సర్వీసును రద్దు చేశారు. విమాన సర్వీసుల రద్దు విషయాన్ని అధికారులు ముందుగానే ప్రయాణికులకు తెలియజేశారు. నిన్న కూడా తుఫాన్ ప్రభావంతో పలు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. వరుసగా రెండో రోజు విమాన సర్వీసులపై తుఫాన్ ప్రభావం పడటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.