Site icon NTV Telugu

Muralidhar Rao: కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు కోవర్ట్..

Muralidhar Rao

Muralidhar Rao

ఏషియన్ గేమ్స్ లో వందకు పైగా పథకాలు సాధించడం వెనుక మోడీ కృషి ఉంది అని బీజేపీ నేత మురళి ధర్ రావు అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ తెలంగాణలో పని చేస్తుంది.. బీజేపీ కౌన్సిల్ సమావేశంలో చాలా వ్యూహాత్మక అంశాలు చర్చించాము.. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన మా టార్గెట్.. సీఎం అనారోగ్యంగా ఉంటే ప్రారంభ కార్యక్రమాలు కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్నారు.. ఇంతకన్నా కుటుంబ పాలన కు ఉదాహరణ ఏమీ కావాలి.. బావ బావమరిదులు రాష్ట్రాన్ని సగం సగం పంచుకున్నట్టు కనిపిస్తుంది అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్లో కాన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం చేస్తుంది.. మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వంద శాతం లబ్ది దారులకు చేరాయి.. టైం ప్రకారం డెలివరీ చేస్తుంది మోడీ సర్కార్ మాత్రమే అని మురళి ధర్ రావు తెలిపారు.

Read Also: PM Modi Speech: ఎర్రకోట ప్రసంగంలో చేసిన ప్రకటనలపై ప్రధాని మోడీ సమీక్ష

మోడీ పథకాలకు కేసీఆర్ పథకాలకు మధ్య ఉన్న తేడాను ప్రజలకి వివరిస్తాము అని మురళి ధర్ రావు పేర్కొన్నారు. పూర్తి మెజారిటీ బీజేపీకి ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. తెలంగాణ ప్రజలను ఎలక్షన్ సర్వేలు అంచనా వేయలేవు.. తెలంగాణలో యువత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంది.. కాంగ్రెస్ నమ్మకం లేని పార్టీ, భరోసా ఇవ్వలేని పార్టీ.. ఆ పార్టీ ది అరువు తెచ్చుకునే పరిస్థితి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దళారీ వ్యవస్థ నడవాలనుకునే వారు లేని కాంగ్రెస్ ను పిక్చర్ లోకి తీసుకువస్తున్నారు.. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కోవర్ట్.. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే సమావేశం బీజేపీ కౌన్సిల్ లో జరిగింది అని మురళి ధర్ రావు చెప్పుకొచ్చారు.

Read Also: MP Navneet Kaur : మంత్రి రోజాకు మద్దతుగా నవనీత్ కౌర్.. సిగ్గు లేదా అంటూ బండారుపై ఆగ్రహం!

తెలంగాణలో కొత్త నాయకత్వం, కొత్త ప్రభుత్వం రావడం ఖాయం అని మురళి ధర్ రావు అన్నారు. కాంగ్రెస్ ఒక స్మోక్ స్క్రీన్.. కాంగ్రెస్ కు ప్రచారం చేస్తుందే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ A గేమ్ ఆడుతుంది, B గేమ్ ఆడుతుంది.. కాంగ్రెస్ ను నడిపిస్తున్న లీడర్ ఫ్రాంచైజ్ పర్సన్.. ట్రైబల్ వర్సిటీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉంది.. కేంద్రం ఇచ్చింది అని ఆయన చెప్పారు. కేంద్రం ఇస్తా అన్న రాష్ట్ర ప్రభుత్వం సహకరించక పోవడంతో ఆగి పోయాయి… టెక్స్ టైల్ పార్క్ లాంటివి.. పసుపు బోర్డ్ గురుంచి మాట్లాడింది మొదట మేమే.. మోడీ లేకపోతే పసుపు బోర్డ్ వచ్చేదే కాదు.. మేము ఏది చేసిన నేనే చేయించిన అని కవిత చెప్పుకుంటుంది.. మేము ఏమి చేయాలి.. రేపు ప్రభుత్వం కూలిపోయిన నేనే కారణం అనాలి.. కవిత అన్న తర్వాతనే మహిళలు ఉన్నారని మాకు తెలిసిందనుకుంటా.. ఏమీ చెబుతాం ఆమెకు అని మురళి ధర్ రావు అన్నారు.

Exit mobile version