Navneet Kaur Fires On Tdp Leader Bandaru Satyanarayana over Comments On Rk Roja: మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఈ అంశం మీద కేసులు కూడా అవ్వగా కోర్టుకు వెళ్లి బెయిల్ కూడా తెచ్చుకున్నారు బండారు. ఇక ఇప్పుడు మంత్రి ఆర్కే రోజాకి పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ మంత్రి రోజాకు మద్దతుగా వీడియోలు రిలీజ్ చేయగా ఇప్పుడు మహారాష్ట్ర ఎంపీ, మాజీ సినీ హీరోయిన్ నటి నవనీత్ కౌర్ రాణా కూడా మంత్రి రోజాకు అండగా నిలిచారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. మంత్రి రోజాపై ఇంత దిగజారి మాట్లాడతారా? ఏం మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా? అని అని అంటూ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారు కానీ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని అన్నారు.
Mega Family: వరుణ్-లావణ్య పెళ్లి వేడుకలు మొదలయ్యాయి… అందరూ ఉన్నారు జనసేనాని తప్ప
మీరు ఏ పార్టీ అనేది నాకు అనవసరం కానీ ఇలా ఒక మహిళను అందునా సినీ రంగంలో సత్తా చాటి మంత్రిగా ఉన్న మహిళను ఇలా మాట్లాడడం ఏమాత్రం బాలేదని అన్నారు. ఎన్నో సినిమాలు ఎంతో మంది హీరోలతో పని చేసిన ఆమెను ఇలా అనడానికి ఎంత ధైర్యం కావాలి ? అని ప్రశ్నించారు. ఒక లీడర్ అయిన మీరు ఇలా ఒక మహిళను గురించి మాట్లాడేప్పుడు ఏమాత్రం ఆలోచన లేకుండా మాట్లాడతారా? ,మీ దగ్గర ఆధారాలు ఉంటె బయటపెట్టండి కానీ ఇలా అనడం సరికాదని అన్నారు. నేను పార్లమెంటులో ఉన్నపుడు మీ ఏపీ తెలంగాణ మంత్రులు నన్ను చాలా గౌరవిస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. ఒక నటిగా, ఎంపీగా, సాధారణ మహిళగా తాను మంత్రి రోజాకు అండగా ఉంటానని ఎంపీ నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. యావత్ మహిళాలోకం రోజాకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.