Telangana Municipal Elections: తెలంగాణలో ఎన్నికల పోరు షురూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Municipal Elections: తెలంగాణలో ఎన్నికల పోరు షురూ అయ్యింది. రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పోరేషన్ల పరిధిలోని వార్డు, డివిజన్లకు నేడు(బుధవారం) ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ షురూ అయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో మొత్తం 52,17,413 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్లలో పురుషుల(25,49,750) కంటే మహిళలే(26,67,025) అధికంగా ఉన్నారు . ఇతరులు 638 మంది ఉన్నారు. అయితే.. ఇప్పటికే 116 మునిసిపాలిటీల్లోని మొత్తం 2,582 వార్డులకు గానూ ఇప్పటికే 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలోని ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది. మున్సిపాలిటీల్లో 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏడు కార్పోరేషన్ల పరిధిలో 414 డివిజన్‌లు ఉండగా రెండు చోట్ల ఏకగ్రీవమైంది. 412 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. 2225 మంది పోటీలో ఉన్నారు. మొత్తంగా 2,981 స్థానాలకు 12,944 మంది బరిలో ఉన్నట్లయింది. మునిసిపాలిటీల్లో 6017 పోలింగ్ కేంద్రాలను, కార్పోరేషన్లలో 2,174 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఎన్నికల ప్రక్రియలో 41,773 మంది పోలింగ్ సిబ్బంది, 1,379 మంది రిటర్నింగ్ అధికారులు పని చేస్తున్నారు. పోలీస్ శాఖ భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మకమైన 8,191 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈసీ కార్యదర్శి లింగ్యా నాయక్ వెల్లడించారు.
READ MORE: Amazon Shocking Deal: రూ.38,000 ఫుట్ మసాజర్ కేవలం రూ.12,000లకే.! పాదాల నొప్పులకు ఇక చెక్.!
Also Read
- 5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
- Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్‌స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
- Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
- Harbhajan Singh: "అస్సలు భయపడొద్దు".. వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
తాజావార్తలు
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
-
Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్‌స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Harbhajan Singh: “అస్సలు భయపడొద్దు”.. వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే ‘డేంజరస్ గేమ్ ప్లాన్’ చెప్పిన హర్భజన్ సింగ్..
ట్రెండింగ్
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!