Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ విషాదం చోటుచేసుకుంది. అభ్యర్థిగా పోటీలో ఉన్న 40 ఏళ్ల మహమ్మద్ అన్వర్ గుండెపోటుకు గురై మరణించారు. ఎర్రగడ్డలో నివాసి అన్వర్ కౌంటింగ్ ప్రక్రియపై ఉత్కంఠ ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఛాతి నొప్పితో కుప్పకూలినట్లు తెలుస్తోంది. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు.
Lowest Polling: దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అత్యల్ప పోలింగ్‌ను నమోదు చేసింది. ఓటింగ్ ప్రక్రియ మొదలై ఐదు గంటలు అవుతున్నప్పకిటీ, ఓటర్లు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపిస్తున్నాయి.
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు రికార్డు స్థాయిలో సాగింది. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు సమర్పించారు. దీంతో తెల్లవారు జామున మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.