అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై ఆదివారం ఇరానీ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ డ్రా అయింది. లక్నోలోని ఇకాన్ స్టేడియం వేదికగా జరిగిన ఇరానీ కప్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేసింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఐదో రోజు ముంబై స్కోరు రెండవ ఇన్నింగ్స్‌లో 329/8 ఉంది. దీంతో.. ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. కాగా.. ముంబై 27 ఏళ్ల తర్వాత ఇరానీ కప్ ట్రోఫీ గెలుచుకుంది. అంతకుముందు 1997–98లో ముంబై టైటిల్ గెలుచుకుంది. అయితే మ్యాచ్ డ్రా అయినప్పటికి ముంబై ఎందుకు ఛాంపియన్‌గా నిలిచిందనేది క్రికెట్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న.. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం..
Samsung Galaxy S24 Ultra: ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్‌లో శాంసంగ్ ఫోన్‌పై భారీ ఆఫర్..
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీని కైవసం చేసుకుంది..
ఇరానీ కప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడతారు. మ్యాచ్ డ్రా అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారనేది ఇరానీ కప్‌లో నిబంధన. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్ తర్వాత ఆధిక్యం ఉన్న జట్టును ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. తద్వారా రెస్ట్ ఆఫ్ ఇండియాపై తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగుల ఆధిక్యంతో ముంబై ఇరానీ కప్ ట్రోఫీని చేజిక్కించుకోవడంలో విజయవంతమైంది. ఐదో రోజు ముంబై తరఫున తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు 158 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోటియన్ 150 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అజేయంగా 114 పరుగులు చేశాడు. అవస్తి 93 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 51 పరుగులు చేశాడు.
CM Revanth Reddy : కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం..
సర్ఫరాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు..
ముంబై బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. 286 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ అజేయంగా 222 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 17 పరుగులు మాత్రమే చేశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున శరాన్ష్ జైన్ మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున అభిమన్యు ఈశ్వర్ 191 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ధృవ్ జురెల్ (93) మినహా అవతలి ఎండ్ నుండి అతనికి మద్దతు లభించలేదు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శామ్స్ ములాని 40 ఓవర్లలో 122 పరుగులిచ్చి మూడు వికెట్లు, కొటియన్ 27 ఓవర్లలో 101 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశారు.