Site icon NTV Telugu

MI vs GT : నేడు ముంబై vs గుజరాత్ బిగ్ ఫైట్.. ఫైనల్లో సీఎస్కేను ఢీ కొట్టే జట్టు ఏదీ..?

Mi Vs Gt

Mi Vs Gt

ఐపీఎల్ 16వ సీజన్ లో ఇవాళ రెండో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగనుంది. అయితే ఘన విజయంతో ముంబై ఇండియన్స్‌ దూకుడు మీదుంటే.. లీగ్‌లో తొలిసారి గుజరాత్‌ టైటాన్స్‌ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇవాళ జరిగే క్వాలిఫయర్‌–2లో డిఫెండింగ్‌ చాంపియన్ గుజరాత్‌తో ఐదుసార్లు విజేత ముంబై టీమ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. ఓడిన టీమ్‌ ఇంటిముఖం పట్టనుంది. సరైన సమయంలో టాప్‌ గేర్‌ వేసిన ముంబై ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కష్టంగా నాకౌట్‌కు చేరినా.. ఎలిమినేటర్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుచేసి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. లీగ్‌ సాగేకొద్దీ ముంబై బ్యాటర్లు గాడినపడడంతో ఆ జట్టు భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తోంది.

Also Read : Karnataka: ఫలించిన చర్చలు.. కర్ణాటక క్యాబినెట్లోకి 24మంది మంత్రులు.. రేపే ప్రమాణం

టాపార్డర్‌లో రోహిత్‌, ఇషాన్‌ అంతగా ప్రభావం చూపలేకపోయినా.. మిడిలార్డర్‌లో గ్రీన్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచారు. నేహల్‌ వధేరా కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక, బౌలింగ్‌ విషయానికొస్తే బ్రుమా, ఆర్చర్‌ లేకపోయినా.. ఆకాష్‌ మధ్వాల్‌ ఆ లోటును తీరుస్తున్నాడు. సీనియర్‌ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్‌ కూడా అతడికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా లక్నోతో ఎలిమినేటర్‌లో మధ్వాల్‌ 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.. ఈ మ్యాచ్ లో కూడా ఆకాష్‌ నుంచి టీమ్‌ అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది.

Also Read : Vidudala: వెట్రి మారన్ మాస్టర్ పీస్.. ‘విడుదల’ ఓటిటీలోకి వచ్చేసింది

లీగ్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలతో టాప్‌లో నిలిచిన గుజరాత్‌.. క్వాలిఫయర్‌–1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో తగిలిన షాక్‌తో ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. ఛేజింగ్‌లో బలమైన గుజరాత్‌ను చెన్నై చాకచక్యంగా నిలువరించింది. అయితే, హైవోల్టేజ్‌ మ్యాచ్‌ను సొంతగడ్డపై ఆడుతుండడం టైటాన్స్‌కు కొంత ఊరట లాభించేదే అంశం. బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగి పోతున్నాడు. మరోసారి జట్టు అతడిపైనే ఎక్కువ భారాన్ని వేయనుంది.

Also Read : Off The Record: బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీకి క్లారిటీ వచ్చేసిందా.?

ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తురుపుముక్క ఆకాష్‌, గిల్‌ మధ్య పోరు రసవత్తరం కానుంది. విజయ్‌ శంకర్‌ రాణిస్తున్నా.. హార్దిక్‌ పాండ్యా, మిల్లర్‌, రాహుల్ తెవాటియా లాంటి హిట్టర్లు ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరాలంటే మాత్రం వీరి నుంచి జట్టు మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. బౌలింగ్‌లో షమి, రషీద్‌ రాణిస్తున్నా.. ముంబై బ్యాటర్లు నుంచి వీరికి విషమ పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ఓవరాల్‌గా నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఎలా నెగ్గాలో తెలిసిన ముంబైతో తలపడడం గుజరాత్‌కు పెద్ద సవాలే..!

Exit mobile version