Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
- ముంబై నారిమన్ హౌజ్‌పై రెక్కీ..
- 26/11 దాడులుకు గురైన ప్రాంతమే టార్గెట్..
- ఒకరిని అరెస్ట్ చేసిన నవీ ముంబై ఏటీఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Terror Plot: 26/11 ముంబై దాడుల్లో లక్ష్యంగా మారిన నారిమన్ హౌజ్‌పై రెక్కీ నిర్వహించారనే ఆరోపణలపై 20 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీ ముంబైలోని ఐరోలి ప్రాంతానికి చెందిన యశ్ సింగ్, ముంబైలోని కీలక ప్రాంతాలు, ముఖ్యంగా కొలాబాలో ఉన్న యూదుల మత, సాంస్కృతిక కేంద్రం చాబాద్ హౌజ్ వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. విదేశాల్లో ఉన్న హ్యాండర్లకు ఈ ఫోటోలు, వివరాలు పంపించినట్లు ఆరోపించారు.
నవీ ముంబై యాంటీ టెర్రరిజం స్క్కాడ్(ఏటీఎస్) ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. సోషల్ మీడియా ద్వారా అంతర్జాతీయ నేర ముఠాలతో యశ్ సింగ్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడి కార్యకలాపాలకు కేరళలో నమోదైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కేసుతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేరళ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, కేరళ కేసులో ఉన్న సంబంధాలపై విచారించి అతడిని అరెస్ట్ చేశారు.
Also Read
- India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
- SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!
- Kishtwar SPO Killings: ‘‘మసీదు నుంచి బెదిరింపులు, ఇద్దరు పోలీసుల హత్య’’ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..
- Sam Pitroda: ‘‘ప్రధాని మోడీ ఫోన్లు ట్యాప్ చేయరు’’.. రాహుల్‌కు భిన్నంగా సామ్ పిట్రోడా కామెంట్స్.!
నారిమన్ హౌజ్‌పై నిఘా..
ముంబైలో సున్నితమైన ప్రాంతాలపై నిఘా పెట్టి సమాచారాన్ని సేకరించాల్సిందిగా నిందితుడికి సూచనలు అందినట్లు తేలింది. ముఖ్యంగా కొలాబాలోని చాబాద్ హౌజ్(నారిమన్ హౌజ్)పై అతను రెక్కీ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. యూదుల మత కేంద్రంగా ఉన్న ఈ భవనం 2008 నవంబర్ లో జరిగిన 26/11 ఉగ్రదాడులకు గురైంది. ముంబైలో నివసిస్తున్న యూదులు, విదేశీయులు, వారి వ్యాపార సంస్థలకు సంబంధించిన వివరాలను కూడా సేకరించాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
పాక్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లో సంబంధాలు..
నవీ ముంబై ఏటీఎస్ చెప్పిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది షహజాద్ భట్టి నేర ముఠాతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న యువతను టార్గెట్ చేస్తున్నట్లు తేలింది. సున్నితమైన ప్రాంతాలపై రెక్కీ నిర్వహించడం, ఫొటోలు, ఇతర వివరాలు సేకరించడం వంటి పనులకు డబ్బు ఆశ చూపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌తో నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో దీనిపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!