Mumbai: పట్టాలు తప్పిన మోనోరైలు.. గాల్లో మొదటి కోచ్ (వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai: మహారాష్ట్రలోని ముంబైలో మోనోరైలు రైలు పరీక్షా సమయంలో ప్రమాదానికి గురైంది. మోనోరైలు పట్టాలు తప్పడంతో దాని ముందు భాగం గాల్లోనే నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ, పరీక్ష సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద విషాదం తప్పింది. మోనోరైలు రైలు పట్టాలు తప్పి ఒక నిర్మాణాన్ని ఢీకొట్టినట్లు చెబుతున్నారు. MMRDA, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
READ MORE: Phone Chargers: ఇలాంటి మొబైల్ ఛార్జర్లు కొనొద్దు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం..!
Also Read
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
- Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
ప్రమాదంలో మోటార్‌మ్యాన్ గాయపడ్డాడు. అయితే, రెస్క్యూ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని రక్షించారు. ఈ సంఘటనలో రైలు అలైన్‌మెంట్ దెబ్బతింది. ఈ సంఘటనకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోనోరైలు నిర్మాణంపై ఆగిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పట్టాలు తప్పడం వల్ల.. ముందుకు కదలలేకపోతోంది. ముంబైలోని మోనోరైలును MMRDA అనుబంధ సంస్థ అయిన మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తుండటం గమనించదగ్గ విషయం. ఈ సంవత్సరం వర్షాకాలంలో తరచుగా అంతరాయాలు, సాంకేతిక సమస్యల కారణంగా ముంబైలోని ఏకైక మోనోరైలు ప్రస్తుతం సేవలకు దూరంగా ఉంది. ఒక వేళ ప్రయాణికులు ఉంటే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
READ MORE: Manchu Brothers : ఫ్యామిలీ గొడవలు పక్కన పెట్టి మళ్లీ ఒక్కటవ్వనున్న మంచు బ్రదర్స్?
A Monorail train, undergoing testing at Mumbai's Wadala, met with an accident after it derailed and hit a structure.
The motorman sustained injuries and was rescued from the spot. The alignment of the train was damaged in the incident. pic.twitter.com/PeYkXRl2YA
— Vani Mehrotra (@vani_mehrotra) November 5, 2025
తాజావార్తలు
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
-
Pocharam Srinivas Reddy: “అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా”.. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
-
Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
-
Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
-
Mitchell Starc History: మిచెల్ స్టార్క్ నయా చరిత్ర.. టెస్టు క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ రారాజు!
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!