మంచు కుటుంబం గురించి మాట్లాడితే.. ఇది ఎప్పుడూ వార్తల్లో ఉండే ఫ్యామిలీ అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఈ కుటుంబంలో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు, ముఖ్యంగా విష్ణు – మనోజ్ మధ్య జరిగిన ఆస్తి తగాదాలు, అభిమానులను కూడా నిరాశపరిచాయి. ఒకప్పుడు చాలా క్లోజ్‌గా ఉన్న ఈ ఇద్దరు అన్నదమ్ములు, ఇప్పుడు దూరమై పోవడం అందరికీ ఆశ్చర్యమే. కానీ తాజాగా ఈ గొడవలకు పుల్‌స్టాప్ పడబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Also Read : Jatadhara : ‘జటాధర’లో ధన పిశాచి సీక్వెన్స్ పై ప్రేరణ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మంచు మనోజ్ ఎప్పటినుంచో కుటుంబాన్ని మళ్లీ కలపాలనే ప్రయత్నం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన పలు సందర్భాల్లో తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు గురించి గౌరవంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్ని విభేదాలు ఉన్నా, కుటుంబం ఒక్కటై ఉండాలనే మనోజ్ మనసులోని కోరిక ఇప్పటికీ అలాగే ఉందని తెలిసింది. అయితే ఇప్పటి వరకు మోహన్ బాబు గానీ, విష్ణు గానీ పెద్దగా స్పందించలేదు. ఇక ఇప్పుడు మోహన్ బాబు సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, నవంబర్ 22న “ఎంబీ 50” పేరుతో గ్రాండ్ సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నారు విష్ణు. ఈ ఈవెంట్‌కి టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్, మోలీవుడ్ స్టార్‌లు హాజరవుతారని సమాచారం. తండ్రికి గుర్తుండిపోయే వేడుకగా మార్చాలనే లక్ష్యంతో విష్ణు ప్రతి అంశాన్ని స్వయంగా చూసుకుంటున్నారట.
దీంతో అందరి దృష్టి మనోజ్‌పైనే ఉంది ఈ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌కు ఆయన హాజరవుతారా? అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు ఇక్కడితో ముగిసిపోతాయా? అనే కుతూహలం నెటిజన్లలో పెరిగిపోతోంది. ఈ వేడుకే మంచు బ్రదర్స్ మధ్య మళ్లీ కలయికకు వేదిక అయితే, అది అభిమానులకు నిజంగా హ్యాపీ న్యూస్ అవుతుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూడా అభిమానులు “ఎప్పుడైనా అన్నదమ్ములు కలిస్తే బాగుంటుంది”, “మోహన్ బాబు గారికి గౌరవం ఇవ్వాలంటే ఫ్యామిలీ ఒక్కటిగా ఉండాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద, మంచు ఫ్యామిలీ మళ్లీ కలిసే అవకాశం కనిపిస్తుండటం తో, సినీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.