WPL 2024: సజన దెబ్బకి దిమ్మతిరిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. వాట్ ఏ షాట్

Sanjana

Sanjana

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL2024) రెండో సీజన్ శుక్రవారం నాడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో స్టార్ట్ అయింది. ఆరంభ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు కొనసాగింది. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య చేధనలో ముంబయి ఇండియన్స్ సూపర్ విక్టరీ సాధించింది. ముంబై జట్టుకు చివరి బంతికి 5 రన్స్ కావాల్సిన సమయంలో అప్పుడే క్రీజులోకి వచ్చిన సజనా సిక్స్ కొట్టి గెలుపును అందించింది. దీంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది.

Read Also: OG Movie: పవన్ ఎన్నికల్లో బిజీ అయినా అనుకున్న రోజుకే దింపుతాం!

ఇక, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 171 రన్స్ చేసింది. 172 పరుగుల లక్ష్య చేధనతో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీమ్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ హెలీ మాథ్యూస్ సున్నా పరుగులకే ఔట్ అయింది. ఆ తర్వాత యాస్తికా భాటియా ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేయగా.. 45 బంతుల్లో 57 పరుగులు చేసి ఔట్ అయింది. నాట్ స్కివర్ బ్రంట్ (19) త్వరగానే అవుటైన.. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ (55) రెచ్చిపోయింది. చివరకు కౌర్ అవుట్ కావడంతో మ్యాచ్ టెన్సన్ గా మారింది.

Read Also: IND vs ENG 4th test: తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్‌

అయితే, రెండో ఇన్సింగ్ చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి పరిస్థితి ఏర్పాడింది. దీంతో క్రీజులోకి అప్పుడే సజీవన్ సజన వచ్చారు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ విజయం దాదాపు ఖాయమని అందరు అనుకుంటున్న టైంలో చివరి బంతికి సంజన సిక్స్ కొట్టి టీమ్ ను విజయతీరాలకు చేర్చారు. దీంతో ముంబై ఇండియన్స్ మహిళల జట్లు నాలుగు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.