NTV Telugu Site icon

Mukesh Ambani: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి ముకేశ్‌ అంబానీ.. ఎందుకంటే.?

Ambani

Ambani

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్‌ అంబానీ ఇవాళ (బుధవారం) మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను ఆయన నివాసంలో మర్వాదపూర్వకంగా కలిశారు. జూలై 12వ తేదీన జరగనున్న తన కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఆయనతో పాటు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ షిండేను కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు రాధికా మర్చంట్‌కు వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు.

Read Also: CM Revanth Reddy: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. పలు కీలకాంశాలపై చర్చ

అయితే, అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ సోమవారం ముంబయిలోని అజయ్ దేవగన్ ఇంటికి వెళ్లి తమ పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ కాశీ విశ్వనాథుడిని దర్శించి తొలి వివాహ ఆహ్వాన పత్రికను సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనం తర్వాత ఆమె లోకల్ హోటల్ లో స్థానికులతో మాట్లాడారు. 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చా.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కాశీ విశ్వనాథ్ కారిడార్, నమో ఘాట్, సోలార్ ఎనర్జీ ప్లాంట్లు, పరిశుభ్రతను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని నీతా అంబానీ పేర్కొనింది.

Read Also: Shocking Video : పట్టపగలు మహిళపై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసిన దుండగులు..

కాగా, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లి జులై 12న ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోతుంది. 2022లో రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో వీరి నిశ్చితార్థం జరగ్గా.. ఇటీవల మార్చి 1 నుంచి 3 వరకు జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ప్రీ- వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.