Mukesh Ambani : భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ ఇల్లు `యాంటిలియా` గురించి వినే ఉంటారు. ముంబాయి అల్టామౌంట్ రోడ్‌లో యాంటిలియా భవనం ఉంది. ఇందులో మొత్తం 27 అంతస్తులు ఉంటాయి. యూకేకు చెందిన బకింగ్ హామ్ ప్యాలస్ తర్వాతే ఇదే అత్యంత ఖరీదైన భవనం. దీని విలువ రూ.12000 కోట్లు. దక్షిణ ముంబాయి మధ్యలో ఈ భవనం ఉంది. యాంటిలియా నుంచి ముంబాయి మొత్తం కనిపించడమే కాదు అరేబియన్ సముద్రాన్ని కూడా వీక్షించవచ్చు. 9 లిఫ్టులు కలిగి ఉన్న ఈ భవనంలో హెల్త్ స్పా, సెలూన్, మూడు స్విమ్మింగ్ పూల్స్, ఒక బాల్‌రూమ్, యోగా, డ్యాన్స్ స్టూడియోలు, విలాసవంతమైన లివింగ్ రూమ్స్, అతిపెద్ద గార్డెన్ ఉన్నాయి.
Read Also:Durgam chinnayya: హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం.. దుర్గం చిన్నయ్యపై వెలిసిన బ్యానర్లు
ఈ యాంటిలియా భవనంలో ఆరు అంతస్తులు కారు పార్కింగ్ కి కేటాయించారు. మొత్తం 168 కార్లు పార్క్ చేసేందుకు కావాల్సినంత స్థలం ఉంటుంది. అలాగే ఈ భవనంలో దాదాపు 600 మంది ఉద్యోగులు నిత్యం పని చేస్తుంటారు. ముంబాయి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు యాంటిలియాలో స్నో రూమ్ కూడా ఉంటుంది. ఇక తీవ్రమైన భూకంపాలు సంభవించినప్పటికీ తట్టుకునేలా ఈ భవనాన్ని రూపొందించడం మరొక విశేషం.
Read Also:Himanta Biswa Sarma: అస్సాంలో మరో 300 మదర్సాలను మూసివేస్తాం..
తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను ముఖేష్ అంబానీకి చెందిన జియో కన్వెన్షన్ సెంటర్ లిఫ్ట్‌లో ఉన్నాడు. ఈ వీడియోలో దాదాపు డబుల్ బెడ్రూం ఇంటి అంత పెద్ద అంబానీ లిఫ్ట్‌ని చూపించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ లిఫ్టులలో ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. తరుణ్ షేర్ చేసిన ఈ వీడియోలో సోఫా కూడా లిఫ్ట్‌లో ఉందని చెబుతున్నాడు. అలాగే, ప్రజలు తమ ఇళ్లలో షాన్డిలియర్లు అమర్చాలని కలలు కంటారు, కానీ ఇక్కడ అంబానీ లిఫ్ట్‌లో షాన్డిలియర్లు ఉన్నాయి. ఈ ఎలివేటర్ జియో వరల్డ్ సెంటర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటర్. ప్రస్తుతం ఈ యువకుడు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.