Site icon NTV Telugu

Mudragada Padmanabham: పవన్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు

Mudragada To Pk

Mudragada To Pk

Mudragada Padmanabham: హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారిని ఖండించాలని ముద్రగడ పద్మనాభం అన్నారు. అధికారం కోసం ఒక పార్టీ అధినేత మీద దాడి చేయడం మంచిదా ప్రతిపక్షాలు ఆలోచించాలన్నారు. హత్యా ప్రయత్నాలు ఎంతవరకు న్యాయమని.. మన రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేయడం సాంప్రదాయమా అంటూ ప్రశ్నించారు. దాడి చేయడం సిగ్గుచేటు అని, అటువంటి వారిని క్షమించకూడదన్నారు.

Read Also: Purandeswari: సీఎం జగన్‌పై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దృష్టిలో 175 నియోజకవర్గాలలో పిఠాపురం నెంబర్1 గా ఉండాలని అనుకుంటున్నానన్నారు. సీఎంకు పిఠాపురం నెంబర్ వన్ అయితే పులివెందుల నెంబర్ 2 అని పేర్కొన్నారు. పిఠాపురంలో హీరోని తన్నీ తరిమేయాలని.. అలా చేస్తే సినిమా నటులు ఇక రాజకీయాల్లోకి రారు అని ముద్రగడ వ్యాఖ్యానించారు. షూటింగ్‌లు చేయడానికి ఎమ్మెల్యే పదవి కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు. కష్టం వస్తే షూటింగ్‌లకు వచ్చి చెప్పాలా అంటూ ప్రశ్నలు గుప్పించారు. ముఖానికి రంగు వేసుకుని తైతక్కలాడుతూ ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారన్నారు. పెద్దలు పిల్లల్ని కంట్రోల్‌లో పెట్టాలన్నారు. 2,30,000 ఓట్లు ఉంటే మూడు లక్షలు మెజారిటీతో గెలుస్తానంటున్నాడని ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు.

Exit mobile version