Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్తత
- కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు
- గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరుల నినాదాలు
- తండ్రి కడసారి చూపుకోసం వచ్చిన కూతురు క్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభంకు కడసారి నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని పోలీసులు, ముద్రగడ అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ‘గో బ్యాక్ క్రాంతి’ అంటూ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో.. అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ, క్రాంతి మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలు నెలకొన్నాయి. ఆ విభేదాల ప్రభావంతోనే ఇప్పుడు కిర్లంపూడిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
తండ్రి ముద్రగడ పద్మనాభంకు నివాళులు అర్పించేందుకు కిర్లంపూడికి బయలుదేరిన క్రాంతిని మొదట ప్రత్తిపాడు వద్ద పోలీసులు ఆపేశారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకే ఆమెను అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. గతంలో తనకు, కుమార్తెకు మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో తాను మరణిస్తే క్రాంతి రావద్దని ముద్రగడ చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే తండ్రిని చివరిసారైనా చూసేందుకు అనుమతించాలని క్రాంతి భావోద్వేగంతో పోలీసులను వేడుకుంది. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. నివాళులు అర్పించేందుకు పరిమిత అనుమతి ఇచ్చారు. నివాళులు అర్పించిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
Also Read
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్‌కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
ముద్రగడ నివాసం వద్దకు చేరుకున్న క్రాంతిని ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. ‘గో బ్యాక్ క్రాంతి’ అంటూ నినాదాలు చేశారు. కొందరు అనుచరులు ముద్రగడ మరణానికి క్రాంతే కారణమంటూ ఆరోపణలు చేస్తూ నినాదాలు చేయడంతో.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల మధ్య భావోద్వేగానికి గురైన క్రాంతి.. తన తండ్రిని ఒక్కసారి చూడనివ్వాలని కన్నీటి పర్యంతమైంది. అనంతరం పోలీసుల భద్రత మధ్య ఆమె ముద్రగడ పద్మనాభంకు నివాళులు అర్పించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి.. నివాళుల అనంతరం క్రాంతిని అక్కడి నుంచి తరలించారు.
తాజావార్తలు
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్‌రూమ్‌కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్‌సెట్‌పై ఉద్యోగి ఆవేదన
-
Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్‌కు షాక్.. ‘పెద్ది’కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
-
Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!