NTV Telugu Site icon

Mudragada Padmanabha Reddy: మమ్మల్ని బూతులతో తిట్టించే బదులు.. అందర్నీ చంపేయండి..!

Mudragada

Mudragada

మమ్మల్ని బూతులతో తిట్టించే బదులు.. మా కుటుంబంలో ఏడుగురుము ఉన్నాం.. అందరినీ చంపించేయండి అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తెలిపారు. మేము అనాథలం ఎవరు అడ్డుకోరు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు.. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలి.. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చమని కోరాను.. నా సవాల్ కు కట్టుబడి నా పేరు మార్చుకున్నాను అని పేర్కొన్నారు. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి.. వైసీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు వెంటనే ఆపాలి.. నేను చేతకాని వాడిని అసమర్థుడిని కాబట్టి పవన్ కళ్యాణ్ ను ఉద్యమం చేయాలని కోరాను.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయి.. కాబట్టి కాపులకు రిజర్వేషన్ సాధించాలి అన్నారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి అని ముద్రగడ పద్మనాభరెడ్డి పిలుపునిచ్చారు.

Read Also: Pawan Kalyan: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని.. 21 మందితో.. 21న..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం శపథం చేశారు. అయితే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ 70 వేల మెజారిటీతో గెలిచి.. ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్‌ స్టార్ట్ అయింది. తాను సవాలులో పేరుమార్పు కోసం దరఖాస్తు చేసుకోగా ఇటీవలే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుతూ ఏపీ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.