Pawan Kalyan: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని.. 21 మందితో.. 21న..
- తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
- సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరుగులేని విజయం
- అసెంబ్లీ సమావేశాలుకు హాజరైన పవన్
- పొత్తులో భాగంగా 21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ.. 21 స్థానాల్లో విజయం.. 21 మంది ఎమ్మెల్యేలతో.. 21వ తేదీన అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు.. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరుగులేని విజయాన్ని అందుకున్న ఆయన.. ఈ రోజు, రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాలుకు హాజరయ్యారు.. ఆయనకు మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అయితే, అసెంబ్లీలో పవన్ కల్యాణ్ అడుగుపెట్టిన రోజుకు ఓ ప్రత్యేక ఉందనే చెప్పాలి.. ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది జనసేన పార్టీ.. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు దక్కగా.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి రికార్డు సృష్టించారు జనసేనాని.. అంటే.. 21 సీట్లు తీసుకొని.. 21 ఎమ్మెల్యేలను గెలిపించుకుని.. ఆ 21 మంది ఎమ్మెల్యేలతో.. 21వ తేదీన అసెంబ్లీలో అడుగుపెట్టారు..
Read Also: ESI Hospital: దిక్కున్న చోట చెప్పుకోండి.. ఈఎస్ఐలో రోగులపై సిబ్బంది జులుం
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరిన జనసేన పార్టీ కీలక శాఖలు దక్కించుకున్న విషయం విదితమే.. ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైన శాఖలను తీసుకున్నారు కొణిదెల పవన్ కల్యాణ్.. తమ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కీలకమైన శాఖలు దక్కించుకున్నారు.. కాగా, 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలోని నోవాటెల్ లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించాడు. ఇక, అప్పటి నుంచి వివిధ స్థాయిల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చారు.. ఇక, 2014 సాధారణ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ , టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చింది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీతో, చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు పవన్ కల్యాణ్.. అయితే, జనసేన ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది.. కానీ, టీడీపీ-బీజేపీ విజయం వెనుక జనసేనాని కృషి మరులేనిది.. ఆ తర్వాత బీజేపీ-టీడీపీకి దూరమైన ఆయన.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.. ఆ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, బీఎస్సీ కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసింది జనసేన పార్టీ.. ఈ ఎన్నికల్లో పవన్.. గాజువాక మరియు భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే విజయం సాధించినా.. ఆయన కాల క్రమంలో పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటూ.. చివరకు వైసీపీకి దగ్గరయ్యారు..
Read Also: Shah Rukh Khan Mansion: అమెరికాలో షారుఖ్ ఖాన్ మాన్షన్.. ఒక రాత్రికి 2 లక్షలు!
మరోవైపు.. 2023లో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వైఫల్యాలను ఎత్తిచూపేందుకు పవన్ కల్యాణ్.. వారాహి యాత్ర ప్రారంభించారు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత పొత్తుతో ముందుకు వెళ్తామని ప్రకటించారు.. మార్చి 2024లో, టీడీపీ శాసనసభ ఎన్నికలు మరియు 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్డీఏలో తిరిగి చేరింది, దీనిని సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో త్రి-పార్టీ కూటమి లేదా కుటమిగా మార్చింది. ఈ కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృషి మరవులేనిది.. ఇక, ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా జనసేన పార్టీ రికార్టు సృష్టించింది.. పిఠాపురం నియోజకవర్గంలో 70,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు పవన్.. ఆ తర్వాత ప్రభుత్వంలో చేరి ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు దక్కించుకున్నారు.. ఈ రోజు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..