NTV Telugu Site icon

Mudragada Padmanabha Reddy: పేరు మారింది.. ఇక, ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి

Mudragada

Mudragada

Mudragada Padmanabha Reddy: కాపు ఉద్యమ నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లీడర్‌ ముద్రగడ పద్మనాభం పేరు మారిపోయింది.. అధికారికంగా ఆయన పేరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చారు.. ముద్రగడ పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా గుర్తిస్తూ గెజిట్‌ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలిస్తే.. తన పేరు మార్చుకుంటాను అంటూ ముద్రగడ సవాల్‌ చేసిన విషయం విదితమే.. అంతే కాదు, ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఛాలెంజ్‌కు కట్టుబడి ఉంటానని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించారు ముద్రగడ..

Read Also: Minister TG Bharath: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీజీ భరత్.. స్పెషల్‌ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..

అయితే, పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు.. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది.. ఆయన పేరును మారుస్తూ.. నామకరణ మహోత్సవాలు కూడా నిర్వహించారు. దాంతో.. మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ పద్మనాభం.. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక, ముద్రగడ పద్మనాభం పేరును మారుస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం.. ముద్రగడ పద్మనాభం పేరును ఇకపై ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఉత్తర్వులు వచ్చాయి..