MLA Attacked by Locals: ఏనుగుదాడిలో మహిళ మృతి.. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను తరిమికొట్టిన జనం

Mla Attacked By Locals

Mla Attacked By Locals

MLA Attacked by Locals: ఏనుగు దాడిలో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు చితక్కొట్టారు. పరామర్శకు వస్తే ఎందుకు కొట్టారు అనుకుంటున్నారా..?. అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ చనిపోయింది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో తరచూ ఏనుగుల బారిన పడి ప్రజలు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మృతదేహంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి ఆదివారం సాయంత్రం అక్కడకు వెళ్లారు.

ఆ సమయంలో గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదిలా ఉండగా.. తాము మృతదేహంతో ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే తీరిగ్గా సాయంత్రం వస్తారా అంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన జనం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊరు నుంచి తరిమి తరిమి  కొట్టారు. ఈ లోగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను కాపాడి అక్కడి నుంచి తరలించారు. చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే గ్రామస్తులు దాడి చేశారంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే చొక్కా చినిగిపోవడం గమనార్హం.

×
×
Ad

Mangaluru Auto Blast: మంగళూరు ఆటో పేలుడు కేసులో పురోగతి.. నిందితుడికి ఐసిస్‌తో సంబంధాలు

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఓ మహిళ తన భర్తతో కలిసి ఆదివారం తెల్లవారుజామున పశువులకు మేత కోయడానికి పొలానికి వెళ్లారు. ఒక్కసారిగా ఏనుగు ఇద్దరిపై దాడికి యత్నించగా భార్యాభర్తలు పరుగులు తీశారు. భార్యను వెంబండించిన ఏనుగు తొక్కి చంపేసింది. తన కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో భర్త తీవ్రంగా విలపించాడు.