MLA Attacked by Locals: ఏనుగుదాడిలో మహిళ మృతి.. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను తరిమికొట్టిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Attacked by Locals: ఏనుగు దాడిలో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు చితక్కొట్టారు. పరామర్శకు వస్తే ఎందుకు కొట్టారు అనుకుంటున్నారా..?. అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ చనిపోయింది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో తరచూ ఏనుగుల బారిన పడి ప్రజలు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మృతదేహంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి ఆదివారం సాయంత్రం అక్కడకు వెళ్లారు.
ఆ సమయంలో గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదిలా ఉండగా.. తాము మృతదేహంతో ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే తీరిగ్గా సాయంత్రం వస్తారా అంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన జనం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊరు నుంచి తరిమి తరిమి కొట్టారు. ఈ లోగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను కాపాడి అక్కడి నుంచి తరలించారు. చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే గ్రామస్తులు దాడి చేశారంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే చొక్కా చినిగిపోవడం గమనార్హం.
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
Mangaluru Auto Blast: మంగళూరు ఆటో పేలుడు కేసులో పురోగతి.. నిందితుడికి ఐసిస్‌తో సంబంధాలు
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఓ మహిళ తన భర్తతో కలిసి ఆదివారం తెల్లవారుజామున పశువులకు మేత కోయడానికి పొలానికి వెళ్లారు. ఒక్కసారిగా ఏనుగు ఇద్దరిపై దాడికి యత్నించగా భార్యాభర్తలు పరుగులు తీశారు. భార్యను వెంబండించిన ఏనుగు తొక్కి చంపేసింది. తన కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో భర్త తీవ్రంగా విలపించాడు.
Shobha (45) of #Hullemane village near #Kundur, #Mudigere taluk, died on Sunday morning due to elephant attack. It has been alleged that #BJP MLA #MPKumaraswamy who came late to the spot was beaten up and his clothes torn apart.#Karnataka #Chikkamagaluru #BJPGovt #BJPMLA pic.twitter.com/KPmRlcB53a
— Hate Detector 🔍 (@HateDetectors) November 20, 2022
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!