MS Dhoni Retirement: సీఎస్‌కే వారసుడిగా సంజూ..? ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ, ఆకాశ్ రియాక్షన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Retirement: మరో మూడు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ‘ఇదే ఎంఎస్ ధోనీకి చివరి సీజన్ అవుతుందా ?’ అనే ప్రశ్న మళ్లీ మొదలైంది. గత కొన్నేళ్లుగా చాలా మంది అభిమానుల నోళ్లలో నానుతున్న ప్రశ్న ఇది. ధోనీ చివరిసారిగా భారత్ తరఫున ఆడి దాదాపు ఏడేళ్లు అయినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున తన 19వ ఐపీఎల్ సీజన్‌లోకి అడుగుపెట్టనున్నాడు. అయితే.. తాజాగా ధోనీ రిటైర్మెంట్‌పై భారత దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐపీఎల్ 2026 తర్వాత ధోనీ రిటైర్ అయ్యే అవకాశం గురించి గంగూలీ ఎలాంటి వివరాలు బయటపెట్టలేదు, కానీ సమీప భవిష్యత్తులో ఈ విషయంపై తాము చర్చించుకునే అవకాశం ఉందని సూచించారు. “ఏం చేయాలో నేను (ఎంఎస్) ధోనీకి చెబుతాను, మీడియాకు కాదు” అని గంగూలీ ఒక కార్యక్రమంలో అన్నారు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఇదిలా ఉండగా.. మార్చి 28న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 ధోనీకి చివరి సీజన్ కావచ్చని, అతడి వారసుడిగా సంజు సామ్సన్ సిద్ధంగా ఉన్నాడని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కేవలం ‘ఇంపాక్ట్ ప్లేయర్’ గానే కొనసాగితే.. ఆ వెటరన్ రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని చోప్రా అన్నారు. జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. క్రికెట్ అనేది ఫుట్‌బాల్ లాంటిది కాదని.. ఇక్కడ డగౌట్ నుంచి జట్టును నడిపించలేరని తెలిపాడు. ధోనీకి ఉన్న అతిపెద్ద బలం మైదానంలో ఉండి ఆటను చదవగలగడం. ఆ స్పష్టత, నమ్మకమే ఆయన్ని గొప్ప నాయకుడిని చేశాయని కొనియాడారు. ఒకవేళ ఆయన కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఆడాలనుకుంటే, ఇక రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని స్పష్టం చేశాడు. గంగూలీ, ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలతో ధోనీ రిటైర్మెంట్ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
READ MORE: Ram Pothineni New Movie: రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఊహించని డైరెక్టర్?
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?