MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Drone Show: నవంబర్ 17న ఆటగాళ్ల రిటెన్షన్ వివరాలను వెల్లడించే ముందు ధోనీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సీఎస్కే యాజమాన్యానికి తెలియజేసినట్లు జట్టు యజమాని రూపా గురునాథ్ తెలిపారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాపై చర్చించేందుకు నిర్వహించిన ఫోన్ కాల్లో ధోనీ తన రిటైర్మెంట్ కోరికను వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పుచుకొచ్చారు. ఈ నేపథ్యంలో ధోని నిర్ణయాన్ని గౌరవిస్తూ.. మేనేజ్మెంట్ రిటైర్మెంట్ ను అధికారికంగా ధ్రువీకరించింది. దీనితో నిన్న రాత్రి చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంపై ధోనీకి ప్రత్యేకంగా డ్రోన్ షో నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికింది సీఎస్కే.
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక నిర్ణయాలు తీసుకుంది. తమ జట్టులోని ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సీఎస్కే.. కొంతమంది ప్లేయర్లను విడుదల చేసింది. అయితే ఈసారి చెన్నై అభిమానులకు అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ఆటగాడిగా కాకుండా.. ఇకపై కేవలం జట్టుకు మెంటార్‌గా సేవలు అందించనున్నాడు.
Also Read
- Koti Deepotsavam 2026: వైభవంగా కోటి దీపోత్సవం.. ఐదో రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవే..
- 200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
- 200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
- Cyclone Akvan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..! అత్యంత భారీ వర్షాలు..
5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. గత మూడు సీజన్లలో కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. దీంతో 2027 సీజన్లో తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో జట్టులోని కీలక ఆటగాళ్లను కొనసాగిస్తూనే, అవసరమైన మార్పులు చేసింది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నలుగురు ఆటగాళ్ల మార్పిడి ఒప్పందాన్ని పూర్తి చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ సీఎస్కేలోకి రాగా.. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వెళ్లారు.
ఐపీఎల్ 2027 కోసం చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 19 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్‌లకు అత్యధికంగా రూ.18 కోట్ల చొప్పున చెల్లించనుంది. కార్తీక్ శర్మకు రూ.14.2 కోట్లు, శివమ్ దూబేకు రూ.12 కోట్లు కేటాయించింది. నూర్ అహ్మద్‌కు రూ.10 కోట్లు, లియామ్ లివింగ్‌స్టోన్‌కు రూ.6 కోట్లు, రాహుల్ చాహర్‌కు రూ.5.2 కోట్లు ఇవ్వనుంది. అలాగే అన్షుల్ కాంబోజ్‌కు రూ.3.4 కోట్లు, జాక్ ఎడ్వర్డ్స్‌కు రూ.3 కోట్లు, గుర్జప్నీత్ సింగ్‌కు రూ.2.2 కోట్లు, డెవాల్డ్ బ్రెవిస్‌కు రూ.2.2 కోట్లు కేటాయించింది. అఖీల్ హొసేన్‌కు రూ.2 కోట్లు, జేమీ ఓవర్టన్కు రూ.1.5 కోట్లు, సర్ఫరాజ్ ఖాన్‌కు రూ.75 లక్షలు ఇవ్వనుంది. శ్రేయస్ గోపాల్, ఆయుష్ మాత్రే, రామకృష్ణ ఘోష్, ఉర్విల్ పటేల్, ముఖేష్ చౌదరిలను రూ.30 లక్షల చొప్పున రిటైన్ చేసుకుంది.
blockquote class=”twitter-tweet”>
CSK’s tribute to MS Dhoni at Chepauk🦁💛
A special drone show in the night sky 🌌 https://t.co/pJiyFZtGEX
— Deepu (@deepu_drops) November 17, 2026
మరోవైపు ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు సీఎస్కే మొత్తం 10 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. మాథ్యూ షార్ట్, మాట్ హెన్రీ, జాక్ ఫౌల్క్స్, ప్రశాంత్ వీర్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ మధ్వాల్, డియాన్ ఫారెస్టర్, మెక్నీల్ నోరోన్హా ఈ జాబితాలో ఉన్నారు. వీరితోపాటు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీ కూడా విడుదలైన ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు. ఈ 10 మంది ఆటగాళ్లను విడుదల చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ వేలం కోసం భారీ మొత్తాన్ని అందుబాటులో ఉంచుకుంది. ఐపీఎల్ 2027 మినీ వేలానికి సీఎస్కే వద్ద మొత్తం రూ.32.55 కోట్ల పర్స్ ఉంది. జట్టులో ఇంకా ఆరు ఆటగాళ్ల స్థానాలు ఖాళీగా ఉండగా.. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్ల స్థానాలు ఉన్నాయి. డిసెంబర్ 16, 2026న గోవాలో ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది.
endrum thala 💛
#ForOurThala https://t.co/VRmPKS2yEe
— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026
<
తాజావార్తలు
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
ట్రెండింగ్
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!