NTV Telugu Site icon

MS Dhoni: ఎకానమీ క్లాస్‍లో ప్రయాణం చేసిన ధోనీ.. చప్పట్లు, కేరింతలతో మార్మోగిన విమానం..

Dhoni

Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న స్టార్ డమ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినాకానీ, ఇంత స్టార్డమ్ ఉన్నా కానీ ధోనీ సింపుల్‍ గానే ఉంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన సంప్లిసిటీని చాటాడు. ధోనీ విమానంలోని ఎకానమీ క్లాస్‍ లో ప్రయాణించాడు. ఎకానమీ క్లాస్‍లో ధోనీని చూసిన ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు తేరుకొని చప్పట్లు, కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు.

Noida Police: మురికి కాలువలో పడిన యువకుడిని రక్షించిన పోలీసులు.. వీడియో వైరల్

ఐపీఎల్ 2024 సీజన్‍ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కాస్త నిరాశ ఎదురైంది. ఆఖరి లీగ్ మ్యాచ్‍ గెలవాల్సిన సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడి ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. 5 సార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన సీఎస్‍కే ఈ సీజన్‍లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఇకపోతే, ఇటీవల బెంగళూరు నుంచి రాంచీకి విమానంలో ఎకానమీ క్లాస్‍లో ప్రయాణించాడు. తన లగేజీని విమానం లోని ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్లో పెడుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది.

MS Dhoni: రాంచీలో ఓటేసిన ధోనీ.. ఎగబడ్డ అభిమానులు

ఇకపోతే, ప్రయాణికులు ముందుగా ధోనిని ఎవరో అని పోల్చుకోలేకపోయారు. ఆ తర్వాత ధోనీ అని గుర్తించగానే చప్పట్లో మోతమోగించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి ధోనీ సింప్లిసిటీని చూసి నెటిజన్లు సలాం కొడుతున్నారు. నేడు జరిగిన లోక్సభ 6 దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. రాంచీలో ఆయన ఓటేశారు. ఇందుకు రాంచీలోని ఓ పాఠశాలలో తన ఓటు హక్కును ధోనీ వినియోగించుకున్నాడు. ఆయన వెంట భార్య సాక్షి కూడా ఉంది. ధోనీ ఓటు వేయడానికి రావటంతో పోలింగ్ కేంద్రం వద్ద కోలాహలం చోటు చేసుకుంది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Show comments