Noida Police: మురికి కాలువలో పడిన యువకుడిని రక్షించిన పోలీసులు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన పోలీసులు ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. మద్యం మత్తులో ఓ యువకుడు 30 అడుగుల లోతులో ఉన్న మురికి కాలువలో పడగా.. పోలీసులు అతడిని బయటకు తీశారు. అతడిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని యూపీ పోలీసులు కూడా తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున డయల్ 112కి మత్తులో ఉన్న వ్యక్తి 30 అడుగుల పొడవైన డ్రెయిన్ పైపులో పడిపోయినట్లు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రెయిన్ పైపులో ఓ యువకుడి అరుస్తున్న శబ్ధాన్ని గుర్తించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో స్థానిక ప్రజలు కూడా పోలీసులకు సహాయం చేయడం వీడియోలో కనిపిస్తుంది.
READ MORE: Tollywood: సెట్స్ మీదకెళ్ళి మూడేళ్లు.. ఇంకెప్పుడు ఈ సినిమాలకు మోక్షం?
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
స్థానికుల సహాయంతో పలువురు పోలీసు అధికారులు మురికి కాలువలోకి దిగి యువకుడికి బయటకు తీసేందుకు యత్నించారు. చివరకు అతడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. లక్షల మంది ఈ వీడియోను చూశారు. పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు. చాలా మంది వీవర్స్ వారికి పొగుడుతూ..కామెంట్స్ పెడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రశంసలు గుప్పించారు. ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ “పోలీసులు, స్థానిక ప్రజలు మంచి పని చేసారు” ఇలా రాసుకొచ్చారు. మరొకరు “పోలీసులకు సహాయం చేసిన స్థానిక ప్రజలే నిజమైన హీరోలు.” అని పోస్టు చేశారు.
తాజావార్తలు
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!