NTV Telugu Site icon

ICC Hall of Fame: మిస్టర్ కూల్ ధోనికి అరుదైన గౌరవం..!

Ms Dhone All Of Fame 2025 Copy

Ms Dhone All Of Fame 2025 Copy

ICC Hall of Fame: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికు క్రికెట్‌లో మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన 2025 హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనిని చేర్చింది. ధోనితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా దిగ్గజాలు హాషిమ్ అమ్లా, గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్‌కు చెందిన డానియేల్ వెటోరి కూడా ఈ గౌరవంలో స్థానం సంపాదించారు. ఈ జాబితాలో మహిళా క్రికెటర్ల నుంచి ఇంగ్లాండ్‌కి చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సారా టేలర్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సనా మిర్లకూ చోటు లభించింది.

Read Also: Minister Narayana: రాష్ట్రంలో రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్.. ఆధునిక ప్లాంట్లను సందర్శించిన మంత్రి నారాయణ..!

ఇక 2025 హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కడంపై ఎంఎస్ ధోని స్పందించాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం గొప్ప గౌరవం. ప్రపంచవ్యాప్తంగా వివిధ తరం క్రికెటర్లను గుర్తించడంలో ఇది ప్రత్యేకమైన గుర్తింపు. అటువంటి గొప్ప దిగ్గజాలతో నా పేరు చేరడం గర్వంగా ఉంది. ఇది నేను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నాడు.

ఇకపోతే ధోని కెప్టెన్సీలో భారత్‌ 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. అలాగే, ఆయన నేతృత్వంలో భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానానికి చేరుకుంది. ఇక ధోని గణాంకాలను చూస్తే.. 538 మ్యాచ్‌లు, 17,266 అంతర్జాతీయ పరుగులు, 829 వికెట్లు (వికెట్ కీపర్‌గా) ధోనిని అత్యుత్తమ ఆటగాడిగా నిలబెట్టాయి. ఈ గణాంకాలు అతని స్థిరత్వం, ఫిట్‌నెస్, దీర్ఘకాలికతకు నిదర్శనంగా నిలిచాయి.

Read Also: Vijayawada: ఇంద్రకిలాద్రి అమ్మవారి ఆలయంలో అంతర్గత బదిలీలు.. 40 మంది అర్చకులతో పాటు పలువురు బదిలీలు..!

ఐసీసీ ప్రకటనలో చెప్పిన విధంగా, 2007 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ నిరాశజనకంగా బయటపడిన సమయంలో ధోనికి టీ20 వరల్డ్‌కప్ కెప్టెన్సీ అప్పగించారు. సీనియర్లు లేకుండా యువ జట్టుతో ధోని తిరుగులేని నాయకత్వాన్ని ప్రదర్శించాడు. రోహిత్ శర్మ, ఆర్పీ సింగ్, రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తిక్ లాంటి కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించి వారిలో ఆత్మవిశ్వాసం పెంచి భారత్‌కు ప్రపంచ మొదటి టీ20 ఛాంపియన్‌గా నిలిచే ఘనతను తెచ్చిపెట్టాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం ఇంకా ఐపీఎల్‌లో క్రికెట్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ గౌరవం ధోని కెరీర్‌లో మరో చిరస్మరణీయ అధ్యాయంగా నిలవనుంది.