LSG vs CSK: మెరిసిన ధోనీ, దూబే.. 5 ఓటముల తర్వాత చెన్నై విజయం
- 5 ఓటముల తర్వాత చెన్నై విజయం
- మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఎంఎస్ ధోనీ
- ఎల్ఎస్జీని కట్టడి చేసిన నూర్ అహ్మద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. అయిదు ఓటముల తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎంఎస్ ధోనీ (26 నాటౌట్; 11 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. శివమ్ దూబే (43 నాటౌట్; 37 బంతుల్లో 3×4, 2×6) రాణించాడు. అంతకు ముందు చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ (0/13) ఎల్ఎస్జీని కట్టడి చేశాడు. ఈ విజయంతో సీఎస్కే ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఇడెన్ మార్క్రమ్ (6), నికోలస్ పూరన్ (4) విఫలమవడంతో లేకనో ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. ఈ సమయంలో మిచెల్ మార్ష్ (30; 25 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి రిషబ్ పంత్ (63; 49 బంతుల్లో 4×4, 4×6) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మార్ష్ అవుట్ అయ్యాక ఆయుష్ బదోని (22), అబ్దుల్ సమద్ (20)ల సహకారంతో పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 18, 19 ఓవర్లలో పంత్ సిక్సర్లు బాదడంతో ఎల్ఎస్జీ స్కోర్ 150 దాటింది. చివరి ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 11 పరుగులే చేసింది. జడేజా (2/24), పతిరన (2/45) రాణించారు.
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ఛేదనలో చెన్నైకి మంచి ఆరంభం దక్కింది. షేక్ రషీద్ 27; 19 బంతుల్లో 6×4) బౌండరీల మోత మోగించాడు. రచిన్ రవీంద్ర (37; 22 బంతుల్లో 5×4) నిలకడగా ఆడడంతో చెన్నై 4 ఓవర్లకు 45 పరుగులు చేసింది. అయితే ఊపుమీదున్న రషీద్‌ను అవేష్ ఔట్ చేశాడు. కొద్దిసేపటికి రచిన్‌ను మార్క్రమ్ ఔట్ చేసి కష్టాల్లోకి నెట్టాడు. మరోవైపు రవి బిష్ణోయ్ (2/18), దిగ్వేశ్ రాఠి (1/23) కూడా సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేశారు. చివరి 5 ఓవర్లలో చెన్నై 56 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎంఎస్ ధోనీ చెలరేగాడు. శార్దూల్ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు రావడంతో.. చెన్నైకి ఆఖరి ఓవర్లో 5 పరుగులే అవసరం అయ్యాయి. దూబే ఫోర్ కొట్టి చెన్నైకి విజయాన్ని అందించాడు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!