ప్రస్తుత కాలంలో ముఖ్యంగా భారతదేశంలో ఇంటర్నెట్ తక్కువ ధరకు లభించడంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనపడుతోంది. అయితే ఇదే క్రమంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించి కూడా అనేక కేసులు పెరిగిపోతున్నాయి. ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన పోస్ట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఓ ఆన్లైన్ మోసాలకు పాల్పడే వ్యక్తి ఏకంగా టీమిండియా దిగ్గజ ఆటగాడైనా మహేంద్ర సింగ్ ధోనీని వాడుకున్నాడు. ఇక అసలుకి ఏం జరిగిందన్న విషయానికి వస్తే..
Also Read: Aa Okkati Adakku: అందరికీ కనెక్ట్ అయ్యే కథ.. ఫస్ట్ ఛాయిస్ ఆయనే : నిర్మాత రాజీవ్ ఇంటర్వ్యూ
ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఓ వ్యక్తికి ధోని మెసేజ్ పంపినట్లుగా తెలుస్తోంది. ఆ మెసేజ్ లో ‘నేను ఎమ్ ఎస్ ధోనిని. నేను నా ప్రైవేట్ అకౌంట్ నుంచి మెసేజ్ చేస్తున్నానని., తాను రాంచి పట్టణంలో బయటకు వచ్చానని.. అయితే పర్సు తెచ్చుకోవడం మర్చిపోయానని ఫోన్ పే ద్వారా తనకు 600 రూపాయలు పంపించండి అంటూ మెసేజ్ పంపించాడు. అంతేకాకుండా ఆ డబ్బుతో తాను బస్సు ఎక్కి ఇంటికి వెళ్తాను. అలా వెళ్లగానే మీ డబ్బును మీకు తిరిగి పంపుతా’ అంటూ మెసేజ్ లో ఉంది. ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే.. ఒక సెల్ఫీని సైతం పంపించడం గమనార్హం. ఇక ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తాజాగా ఓ వ్యక్తి షేర్ చేస్తూ ఇలాంటి మోసాల పట్ల అలెర్ట్ గా ఉండాలని షేర్ చేశాడు. ఆన్లైన్లో మోసాలు ఎక్కువ అవుతున్నాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ మెసేజ్ ఇప్పుడు ప్రాముఖ్యతను సంచరించుకుంది.
Also Read: SRH vs RCB: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..
ఇలా ఎవరైనా తెలియని వారు మెసేజ్లు పంపితే ఒకటికి రెండుసార్లు ఎవరైతే పంపించారో వారిని నేరుగా మాట్లాడి.. అది నిజామా కదా.. సరైన వారు పంపించిందా కాదా అని తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచిది. లేకపోతే అనేక ఆర్టిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.