Site icon NTV Telugu

Mrunal Thakur: బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన మృణాల్ ఠాకూర్.. పాన్ ఇండియా స్టార్‌కు జోడీగా!

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur to romance Prabhas: ‘సీతారామం’ చిత్రంతో అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు బాలీవుడ్ నటి ‘మృణాల్‌ ఠాకూర్‌’. అప్పటివరకు పలు సీరియల్స్, సినిమాలు చేసినా రాని క్రేజ్.. సీతారామంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. తెలుగులో ‘హాయ్‌ నాన్న’సినిమాలో నటించి.. మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ అమ్మడు బిజీ అయిపొయారు. మృణాల్‌ స్టార్ హీరోల సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్‌ చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయి.

ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్‌ను మరో బంపర్ ఆఫర్‌ వరించిందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు జోడీగా మృణాళ్ నటించనుందట. ప్రభాస్ హీరోగా, సీతారామం దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ఓ పీరియాడికల్‌ డ్రామా తెరకెక్కనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ను ఎంపిక చేశారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Also Read: KTM New Colours: సరికొత్త రంగులలో కేటీఎం బైక్‌లు!

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’, ‘సలార్‌-శౌర్యాంగపర్వం’ చేయాల్సి ఉంది. ఈ సినిమాల తరువాత హను రాఘవపూడి చిత్రం ఉంటుందా? లేదా వాటితో పాటు చేస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు మృణాల్ ఠాకూర్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా, పరశురామ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Exit mobile version