ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్, తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది. అసలు ప్రియాంక అంటే తనకు ఎందుకంత ఇష్టమో చెబుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక చోప్రా లైఫ్ జర్నీ తనకు పెద్ద ఇన్‌స్పిరేషన్ అని, ఆమె ఇంటర్వ్యూలను అస్సలు మిస్ అవ్వకుండా చూస్తుంటానని మృణాల్ చెప్పుకొచ్చింది.
Also Read : Tamannaah: ఆ వ్యక్తి చాలా డేంజర్.. విజయ్ వర్మతో బ్రేకప్‌పై తమన్నా షాకింగ్ కామెంట్స్..!
‘ప్రియాంక ప్రయాణం వేరు, నా దారి వేరు.. కానీ మా ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. మేమిద్దరం కష్టకాలంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు, పట్టుదల వదల్లేదు. ప్రియాంక మాట్లాడే తీరు, ఆమె యూత్ కి ఇచ్చే ఎంకరేజ్‌మెంట్ నాకు చాలా నచ్చుతాయి. అందుకే నా ఉద్దేశం ప్రకారం మన ఇండస్ట్రీకి ప్రియాంక చోప్రా లాంటి పవర్ ఫుల్ మహిళలు ఇంకా చాలా మంది అవసరం’ అంటూ మృణాల్ తన మనసులోని మాటను బయటపెట్టింది. దీంతో మృణాల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
