YS Viveka Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ.. సీబీఐ ముందుకు వెళ్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కే సులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది.. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సోమవారం రోజు విచారణ జరగగా.. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు.. మధ్యాహ్నం లోపు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.. ఇక, సోమవారం రోజు అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవొద్దని స్పష్టం చేసిన హైకోర్టు.. మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం ఉదయం పిటిషన్ పై విచారణ చేపడుతామని వెల్లడించింది.
ఇక, వైఎస్ భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్ పెండింగ్ లో ఉండగా అరెస్ట్ చేశారని తెలిపారు. పిటిషన్ విచారణ మాత్రమే జరుగుతుంది కదా అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వలేదు కదా అని న్యాయమూర్తి చెప్పారు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి దస్తగిరి కాంఫెషన్స్ తప్ప ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. దస్తగిరిని సీబీఐ బెదిరించినట్లు, చిత్రహింసలకు గురిచేసినట్లు ఎర్రగంగిరెడ్డి చెప్పాడని అవినాష్ రెడ్డి తరపు లాయర్ పేర్కొన్నాడు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకి వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడని అన్నారు. అవినాష్ రెడ్డి సహా నిందితుడు అంటూ ప్రచారం జరుగుతుందన్నారు. దస్తగిరికి బెయిల్ వచ్చిన తరువత రోజే సీబీఐ 306 పిటిషన్ వేశారని.. ఆయన్ని అప్రూవర్ గా మార్చారని పేర్కొన్నారు.
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
- Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
కాగా, సీబీఐ నోటీసుల మేరకు సోమవారం విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్‌రెడ్డి హాజరయ్యే క్రమంలో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. దీంతో, ఈ మేరకు అవినాష్‌రెడ్డికి సీబీఐ మరో నోటీసు ఇచ్చింది. మరి, అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఎలా సాగనున్నాయి.. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది.. ఈరోజు సీబీఐ అవినాష్‌రెడ్డిని ప్రశ్నిస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
-
Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్‌కు అమెరికా బ్రేక్!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!