Site icon NTV Telugu

Parliament: బడ్జెట్ పై పార్లమెంట్ లో ఆసక్తికర చర్చ.. హాయిగా నిద్రపోయిన ఎంపీ

Saugot Roy

Saugot Roy

ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ స‌మావేశాల స‌మ‌యంలో జాతీయ స్థాయిలో ప్రజ‌ల దృష్టిని ఆక‌ర్షించిన అనేక ఆస‌క్తిక‌ర‌మైన ఉదంతాలు చోటు చేసుకున్నాయి. గురువారం జూలై 25, 2024 నాడు ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ సీనియర్ ఎంపీ సౌగతా రాయ్ తన అభిప్రాయాలను తెలుపుతున్నారు. ముఖ్యంగా సామాజిక రంగానికి తక్కువ నిధులు కేటాయించినందుకు ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. సౌగతా రాయ్ తన అభిప్రాయాలను తెలియజేస్తుండగా, టీఎంసీకి చెందిన మరో ఎంపీ తాహిర్ ఖాన్ నిద్రపోతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది.

READ MORE: PM Modi: శుక్రవారం లడఖ్‌లో మోడీ పర్యటన.. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ ప్రారంభం

సౌగత రాయ్ ప్రసంగం సమయంలో నిద్రిస్తున్న టీఎంసీ ఎంపీ పేరు తాహిర్ ఖాన్. ఆయన పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ. ముర్షిదాబాద్ నుంచి టీఎంసీ వరుసగా రెండోసారి తాహిర్ ఖాన్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నమ్మకాన్ని నిలబెట్టుకుని తాహిర్ ఖాన్ ఇక్కడ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. అన్ని రకాల రాజకీయ ఊహాగానాలను పట్టించుకోకుండా తాహిర్ ఖాన్ ముర్షిదాబాద్ స్థానం నుంచి గెలుపొందారు. ముర్షిదాబాద్ స్థానంలో పోలింగ్ సందర్భంగా అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయని మీకు తెలిసిందే.

READ MORE:Bhagyashri Borse: ఇంకా బోణీ అవలేదు.. అప్పుడే మరో స్టార్ హీరో సినిమా

కాగా.. పార్లమెంటు బడ్జెట్ సెషన్‌లో సౌగతా రాయ్ ఇంగ్లీష్‌లో ప్రసంగించడం ఆసక్తికరంగా మారింది. వాణిజ్య రంగంలో నిధుల కేటాయింపుపై సౌగతా రాయ్ ప్రత్యేకంగా ప్రభుత్వంపై దాడి చేశారు. విద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయిస్తోందని టీఎంసీ ఎంపీ రాయ్ విమర్శించారు.

Exit mobile version