Site icon NTV Telugu

Vallabhaneni Balashowry: వైసీపీ ప్రభుత్వంలో మనం కోరుకుంది వేరు.. జరుగుతుంది వేరు..!

Vallabhaneni Balashowry

Vallabhaneni Balashowry

Vallabhaneni Balashowry: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో మనం కోరుకుంది వేరు, జరుగుతుంది మరోటి అన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రాష్ట్రంలో వైసీపీ విముక్త పాలన రావాలి.. అందుకే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా గాలి కూడా పీల్చుకొలేక పోతున్నారని విమర్శించారు. లక్షలాది మందితో ఈ రోజు వైసీపీ విముక్త అజెండాతో జెండా సభ నిర్వహిస్తున్నాం అన్నారు బాలశౌరి.

Read Also: Tera Kya Hoga Lovely : డీ గ్లామర్ లుక్ లో ఇలియానా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

ఇక, పోలవరం మీద గడిచిన ఐదేళ్లుగా ఐదు శాతం పనులు కూడా చేయలేకపోయారని ఆరోపించారు ఎంపీ బాలశౌరి.. జలజీవన్ పథకాలకు మాచింగ్ గ్రాంట్ లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేక పోయిందన్న ఆయన.. అందుకే అభివృద్ధి చేయలేని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. మచిలీపట్నం – రేపల్లె మధ్య రైలు మార్గాన్ని రాబోయే ఐదేళ్లలో పూర్తి చేసేలా పనిచేస్తా అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మనం కోరుకుంది వేరు, జరుగుతుంది వేరు అంటూ మండిపడ్డారు. వైసీపీ పాలనలో అధర్మం నాలుగు పాదాల మీద తాండవిస్తుంది అంటూ ఆరోపణలు చేవారు.. ధర్మం అనే మాట వైసీపీ పాలనలో లేదని.. అందుకే ప్రజలు, ప్రజా ప్రతినిదులు వైసీపీకి దూరం అవుతున్నారని పేర్కొన్నారు జనసేన నేత, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.

Exit mobile version