NTV Telugu Site icon

Uttam Kumar Reddy : ఉమ్మడి మేళ్లచెరువు మండలాన్ని డెవలప్ చేసిన ఘనత నాదే

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

ఉమ్మడి మేళ్లచెరువు మండలాన్ని డెవలప్ చేసిన ఘనత నాదే అన్నారు మాజీ పీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఇవాళ ఆయన సూర్యాపేట జిల్లా జిల్లాలో మేళ్ళచెరువులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా… లిఫ్ట్ లతో బీడు పొలాలను అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. గతంలో ఎకరా రెండు నుండి మూడు లక్షల కూడా పలకని భూములు…. లిఫ్టులు ఏర్పాటు చేయడంతో కోట్ల రూపాయలు ఎకరా రేటు పలుకుతుందని ఆయన అన్నారు. రైల్వే లైన్ పై పార్లమెంట్ లో ప్రస్తావించింది నేనే అని, ప్యాసింజర్ రైలు మెళ్ళచెరువు, జానపాడు మీదుగా రైల్వే లైన్ ఏర్పాటుపై కేంద్రం కూడా సానుకూలంగానే స్పందించిందని ఆయన వెల్లడించారు.

Also Read : Dhanush: నా భార్య నన్ను ఎప్పుడు మెచ్చుకోలేదు..

కొందరు స్థానిక అధికార పార్టీ నేతలు మేళ్లచెరువు జాతరను ఎన్నడూ లేని విధంగా రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారని ఉత్తమ్‌ అన్నారు. జాతర కోసం బతుకుదెరువుకి వచ్చిన వారి వద్ద నుండి కూడా చందాల పేరుతో అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. సుమారు 14 లక్షలు నుండి 16 లక్షల వరకు చేతులు మారాయని, స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డికి సరైన అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Pakistan: పాత సాయానికే కొత్త ప్యాకింగ్.. టర్కీ పంపిన సాయాన్ని మళ్లీ టర్కీకే పంపిన పాకిస్తాన్

Show comments