Site icon NTV Telugu

Uttam Kumar Reddy: బీఆర్ఎస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Utham

Utham

గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు పార్టీలో తన స్థానాన్ని దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Read Also: Bombay High Court: బాంబే హైకోర్టు సీజేగా జస్టిస్ దేవేంద్ర ఉపాధ్యాయ్ ప్రమాణ స్వీకారం

అవి పూర్తిగా అబద్ధం.. 1994 తర్వాత ఎన్నికల్లో ఓడిపోకుండా.. 30 ఏళ్లు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేసి.. వరుసగా 6 ఎన్నికల్లో గెలిచినందుకు గర్విస్తున్నాను అని ఉత్తమ్ కుమార్ అన్నారు. నా భార్య పద్మావతి రెడ్డి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉండి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కోదాడలో ఉంటూ పీసీసీ ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ తరపున తన శక్తి మేరకు అక్కడి ప్రజల కోసం ఆమె పనిచేస్తున్నారని టీపీసీసీ మాజీ చీఫ్ తెలిపారు.

Read Also: Buddhadeb Bhattacharya: బెంగాల్ మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

మాకు పిల్లలు లేరు. అత్యంత నిబద్ధతతో ప్రజా జీవితంలో 365 రోజులు పని చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పరువు నష్టం కలిగించే వార్తలు రాసి మమల్ని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమైనది.. కాంగ్రెస్ పార్టీలో నా అనుచరులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నాడు. నేను పార్టీలో కొన్ని పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు.. కానీ జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించిన విధివిధానాలను అనుసరిస్తాను అని ఆయన చెప్పాడు. పార్టీ అంతర్గత విషయాల గురించి ఎప్పుడు బయట మాట్లాడను అని ఉత్తమ్ తెలిపాడు.

Read Also: Onions: ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి లాభాలెన్నో..!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై పి.చిదంబరం అధికారిక సర్వసభ్య సమావేశంలో తప్ప ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ను కలవలేదు లేదా మాట్లాడలేదు అని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ అన్నారు. నా ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో పనిచేసినందుకు గర్వపడుతున్నాను.. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పనిచేశా.. ఆ తరువాత రాష్ట్రపతి వెంకటరామన్, ప్రెసిడెంట్ ఎస్‌డీ దగ్గర సీనియర్ అధికారిగా కూడా పనిచేశాను అని ఉత్తమ్ తెలిపారు. యూట్యూబ్ ఛానెల్‌లు, మీడియా సంస్థలు.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారనే నిరాధారమైన, తప్పుడు కథనాలను ఖండిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి ప్రకటనలో తెలిపారు.

Exit mobile version