Uttam Kumar Reddy : టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధి నిలిచిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో మున్సిపల్ పరిపాలనకు అవసరమైన నిధులు విడుదల చేయకుండా టీఆర్‌ఎస్ నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్ ఆరోపించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురువారం హుజూర్‌నగర్‌లో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రాంతాలు చిన్నపాటి వర్షానికి జలమయమవుతున్నాయన్నారు. 2014 నుంచి ప్రతిసారి ఈ సమస్యను పరిష్కరిస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తోందని, గత ఎనిమిదేళ్లుగా ఎలాంటి మార్పు రాలేదన్నారు. 2022లో కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, పలు కూడళ్లలో నీరు నిలిచిపోవడంతో ఇవే సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.
Also Read
“గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నిధుల కొరత కారణంగా పెద్దగా పనులు చేయలేకపోయింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధి నిలిచిపోయిన ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు’’ అని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ‘‘హైదరాబాద్‌ను డల్లాస్ తరహాలో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎప్పుడో హామీ ఇచ్చారు. అయితే గత కాంగ్రెస్ హయాంలో 2004-2014 వరకు జరిగిన అభివృద్ధిని కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?