Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mp Sontosh Green India Challenge Got Limca Book Of Records

Limca Book of Records : ఎంపీ సంతోష్‌ కుమార్‌కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

Published Date :April 4, 2023 , 6:56 pm
By Gogikar Sai Krishna
Limca Book of Records : ఎంపీ సంతోష్‌ కుమార్‌కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే “లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్” లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు చోటు లభించింది. విద్యా, సాహిత్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సినిమా, వ్యాపారం, రక్షణ, సామాజిక సేవ వంటి రంగాల్లో అనితరసాధ్యమైన భారతీయుల కృషిని, విజయాలను గుర్తించి.. “లిమ్కాబుక్” రికార్డులో చోటు కల్పిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ అవార్డును సామాజిక సేవా విభాగంలో “ఒక గంటలో అత్యధిక మొక్కలు నాటించే” బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు రికార్డ్స్ లో చోటు కల్పించినట్లు లిమ్కాబుక్ రికార్డ్స్ ఎడిటర్ వత్సాల కౌల్ బెనర్జీ తెలిపారు. లిమ్కాబుక్ ప్రశంస పత్రాన్ని ఇవ్వాల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అందించినట్లు వారు తెలిపారు.

Also Read : Srirama Navami Wonder: శ్రీరామనవమి వేళ అద్భుతం.. ఆ ఇంట్లో వానరం సందడి

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, దుర్గా నగర్ లో 2021 జూలై 4వ తేదిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక చొరవతో ఒక గంట సమయంలో 16,900 వందల మంది భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటినట్లు సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఇదే అత్యుత్తమని.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు 21 మొక్కలు నాటినట్లు సంస్థ వివరించింది. సమిష్టి కృషి, సామాజిక స్పృకు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించింది.

Also Read : Srirama Navami Wonder: శ్రీరామనవమి వేళ అద్భుతం.. ఆ ఇంట్లో వానరం సందడి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు చోటు లభించడం, ముఖ్యమంత్రి చేతులమీదగా రికార్డు ప్రతిని అందుకోవడం మరింత బాధ్యతను పెంచిందన్నారు. “లిమ్కాబక్”లో చోటు దక్కడానికి ప్రధాన కారణం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న గారు. వారు కేసిఆర్ గారి స్పూర్తితో తన బర్త్ డే సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా భారీగా మొక్కలు నాటాలనే సంకల్పం తీసుకొని.. విశేష కృషి చేసి ఒక గంటలోనే మూడున్నర లక్షలు మొక్కలు నాటించారు. రామన్నగారు, వారి అనుచరుల కృషి మాటల్లో వర్ణించలేనిది. నెల రోజుల పాటు విశేష కృషి చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం మూలంగానే ఇవ్వాల ఈ రికార్డు సాధ్యమైంది. వారికి, వారి అనుచర బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

అంతేకాదు.. ఈ రికార్డ్ ను ఎమ్మెల్యే జోగురామన్నగారికి, ఈ నేల పచ్చగా ఉండాలని అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ప్రకృతి ప్రేమికులు సాలుమారద తిమ్మక్క, వనజీవి రామయ్య, జాదవ్ పయాంగ్ తో పాటు.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా కోట్ల మొక్కలు నాటిని ప్రతీ ఒక్కరికి అంకితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రారంభం నుంచి మొక్కలు నాటిన ప్రతీ కార్యక్రమం తెలిసేలా సంస్థ ప్రతినిధులు వీడియోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధి సంజీవ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Green India Challenge
  • latest news
  • limca book of records
  • MP Santosh Kumar

తాజావార్తలు

  • Rajamouli: జక్కన్న మామూలోడు కాదు.. ఏకంగా VFX స్టూడియో సెటప్!

  • Sanjiv Goenka Gets Emotional: ఏడ్చిన సంజీవ్ గోయెంకా.. ఎందుకంత ఎమోషనల్.?

  • Rishabh Pant-SRH: పంత్ బ్రో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే ఎందుకంత పగ!

  • PCB Chairman vs IPL: ఇంత కుల్లుబోతోడివి ఏందయ్యా నువ్వు.. ఐపీఎల్‌పై పీసీబీ ఛైర్మన్ ఏడుపు!

  • US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్‌”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions