NTV Telugu Site icon

Mp Sanjeev Kumar: ఎంపీని బురిడీ కొట్టించిన కేటుగాడు

Cyber Knl

Cyber Knl

సైబర్ నేరగాళ్ళు పెచ్చుమీరిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పేరు చెప్పి, ఓటీపీలు అడిగి, బ్యాంక్ అకౌంట్ అప్ డేట్ అంటూ.. వివిధ రకాలుగా ఖాతాదారుల్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. తాజాగా ఏపీలో అధికార పార్టీ ఎంపీకి ఇలాంటి తిప్పలు తప్పలేదు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ను మోసగించాడో సైబర్ నేరగాడు.

బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఎంపీ సంజీవ్ కుమార్ కు ఫోన్ వచ్చింది. అగంతకుడికి ఖాతా వివరాలు.. ఓటీపీ చెప్పారు ఎంపీ సంజీవ్ కుమార్. అంతే ఆయన ఖాతా నుంచి ఏకంగా రూ. 97,699 కాజేశాడు అగంతకుడు. తాను సైతం మోసపోయానని గ్రహించి టూ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఎంపీ సంజీవ్ కుమార్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బ్యాంకు పేర్లు చెప్పి ఖాతాదారుల్ని నిలువునా ముంచేస్తున్నారు మోసగాళ్ళు, తస్మాత్ జాగ్రత్త.

Bandi Sanjay : అది నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా..

Show comments