తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్‌ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా అని, అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా వేశా అని ఆయన అన్నారు. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని, అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్త అని ఆయన అన్నారు. పోస్టు పెట్టిన అకౌంట్ డీపీ హరీష్ రావు ఫోటో, కేసీఆర్ ఫోటో ఉందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదా.? అని ఆయన అన్నారు. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండన్నారు ఎంపీ రఘునందన్ రావు.
Read Also : China President: మున్ముందు చైనా గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుంది..
అంతేకాకుండా..’మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే వచ్చి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కప్పారన్నారు. ఇంత సంస్కారహీనంగా, సభ్యత లేకుండా మాట్లాడతారు అనుకోలేదని, కేటీఆర్, హరీష్ రావు దీనిపై స్పందించి సోషల్ మీడియా ను కంట్రోల్ చేసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. హరీష్ రావు ఫోటోలు వాడుకుంటున్నారు అనుకుంటే పోలీసు కంప్లయింట్ ఇవ్వండని, వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదన్నారు. మహిళల మీద బీఆర్‌ఎస్‌కు గౌరవం లేదన్నారు. తెలంగాణ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదన్నారు. నా వల్ల మా అక్కకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నా అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
Read Also : Minister Vangalapudi Anitha: త్వరలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం..