Site icon NTV Telugu

Raghunandan Rao: కవిత తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదు

Raghunandanrao

Raghunandanrao

ఎమ్మెల్సీ కవిత తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సామాజిక తెలంగాణ అని కవిత చెల్లెలు కొత్త నినాదం ఎత్తుకున్నదంటూ ఎద్దేవా చేశారు. 2014లో ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవులిచ్చారని.. ఆనాడు మీ నాన్నను ఎందుకు బీసీలకు పదవులు ఇవ్వలేదని అడగలేదు.? అని ప్రశ్నించారు. ఆనాడు సామాజిక న్యాయం ఎటు పోయిందని నిలదీశారు. అయినా తాటాకు చప్పుళ్లకు.. ఉడుత ఊపులకు బీజేపీ పార్టీ భయపడదని తెలిపారు.

ఇది కూడా చదవండి: Kangana Ranaut : వయస్సు గురించి నాకు పట్టింపు లేదు..

కవిత ఏం మాట్లాడారంటే..
బీజేపీ, కాంగ్రెస్‌కు జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీకి ఎనిమిది ఎంపీలు ఉంటే తెలంగాణ గురించి పార్లమెంట్‌లో ఒక్క అంశం గురించి మాట్లాడరని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌కు జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Naga Chandrika Rani: “మిస్‌ తెలుగు యూఎస్‌ఏ” కిరీటం సొంతం చేసుకున్న పోలవరం భామ..

కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే.. మరో కన్ను జాగృతి అని తెలిపారు. కేసీఆర్.. తెలంగాణ సోయితో పరిపాలన చేశారని.. మన ఖర్మేందంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి జై తెలంగాణ అని కూడా అనరన్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడైనా జై తెలంగాణ అనాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం పేరుతో కార్యక్రమం ఉండకూడదు.. రాజీవ్‌కు తెలంగాణతో ఏం సంబంధం ఉంది? అని అడిగారు. తెలంగాణ వాదుల పేరుతో పథకం పెట్టాలని కోరారు. తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంతాచారి, యాదిరెడ్డి లాంటి వారి పేర్లు పెట్టాలన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై జూన్ 4న జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా చేపడుతున్నట్లు చెప్పారు.

కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను ఎండగడతామన్నారు. బీసీ బిల్లును బీజేపీ డీ ఫ్రీజ్‌లో పెట్టే ప్రయత్నం చేస్తే జాగృతి తరపున మళ్లీ పోరాటం చేస్తామని ప్రకటించారు. విద్యార్థులు, మహిళలు, మైనార్టీల కోసం ఇచ్చిన హామీలపైన కూడా పోరాటం చేస్తామని కవిత వెల్లడించారు.

Exit mobile version