టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. లోకేష్ పాదయాత్ర దేనికి ఉపయోగంలేదు, లోకేష్ తో సెల్ఫీలు ఎవరైనా దిగుతున్నారా అంటూ విమర్శించారు రాజమండ్రి ఎం.పి మార్గాని భరత్ . రాజమండ్రిలో ఎం.పి మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఆదిములపు సురేష్ ఇంటిపై చంద్రబాబు రాళ్లదాడి చేయించడం దారుణమని ఖండించారు. టైమ్స్ నౌ సర్వే ప్రకారం వైసిపికి 25కి 25 ఎంపీ సీట్లు వస్తాయని తేలిందని, అదే స్ఫూర్తితో 175కు 175 సాధించేందుకు ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Chalaki Chanti: చలాకీ చంటికి గుండెపోటు.. పరిస్థితి విషమం
ముఖ్యమంత్రి జగన్ రాజమండ్రి సిటీ ఇంఛార్జి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు. అర్బన్ నుండి ఎవరిని నిలబెట్టిన గెలిపించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని భరత్ రామ్ అన్నారు. జగన్ సీఎం అయిన నుంచి నా ఎస్సీ నా బిసి నా మైనార్టీ అని పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. నాలుగేళ్ళకు పైగా అనేక సంక్షేమ పథకాలతో జగన్ అందరి అభిమానం చూరగొంటున్నారని అన్నారు. విపక్షాలు పనిగట్టుకుని విమర్శలు చేయడం మానుకోవాలన్నారు భరత్.
Read Also: Etela Rajender: రాజ్యాధికారం రావాలంటే చేతల్లో చూపించాలి