ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు..మా తండ్రి గారు 70 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు..మేము నిబద్దతతో వ్యాపారాలు చేస్తాం..మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని చెప్పాడు..మాగుంట కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయనని చెప్పాడు..నేను ఏ తప్పు చేయలేదు.. మీరు ధైర్యంగా ఉండమని నాతో చెప్పాడు..32 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏ తప్పు చేయకుండా సజావుగా ముందుకు వెళ్తున్నాం..నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి క్లీన్ గా బయటకు వస్తాడన్నారు.
Read Also: Konaseema Thugs Movie Review: కోనసీమ థగ్స్ మూవీ రివ్యూ
ఏ తప్పు చేయలేదు కాబట్టి నా కుమారుడిని అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నా అన్నారు శ్రీనివాసులు రెడ్డి. మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు వచ్చినప్పటి నుండి ప్రజలకు సేవ చేశారు..32 ఏళ్లుగా మాగుంట కుటుంబం ఎక్కడ.. ఎవరితో విభేదాలు లేకుండా ముందు వెళ్తున్నారు..సుబ్బరామరెడ్డి మరణం తరవాత మాగుంట శ్రీనివాసులరెడ్డి బాధపడటం ఇప్పుడే చూస్తున్నా..రాజకీయ కుట్రలతో ఆయన్ను అరెస్టు చేయటం దురదృష్టకరం..రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూడటం మంచి పరిణామం కాదన్నారు.
జిల్లా ప్రజలందరూ ఆయనకు అండగా ఉంటారు..ఆయన మనసును కుదుట పరచుకుని ముందుకు సాగాలని కోరుతున్నాం..మనోధైర్యంతో ఆయన ముందుకు సాగాలని కోరుతున్నా..మాగుంట రాఘవరెడ్డికి ప్రకాశం జిల్లా నుండే రాజకీయ ప్రయాణం మొదలు పెడతారు..ఇలాంటి కేసులతో ఏమి చేయలేరు..సీఎం జగన్ ను కూడా గతంలో ఇలాగే ఇబ్బంది పెట్టాలని చూశారు..ఎవరి కోసమో మాగుంట కుటుంబాన్ని బలిచేయాలని చూస్తున్నారు..కావాలని పెట్టే కేసులకు ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
Read Also: Lakshman Karya: ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’గా రావు రమేష్