MP Kesineni Nani: విజయవాడ రాజకీయాల్లో ఎప్పుడూ కేశినేని నాని పేరు హాట్ టాపిక్‌గానే ఉంటుంది.. ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు సొంత పార్టీలోనూ కలవరం సృష్టిస్థాయి.. మరికొన్ని సార్లు అధికార పార్టీకి కూడా విరుచుకుపడతారు.. కానీ, ఇప్పుడు ఈ టీడీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. సొంత పార్టీ నేతలకే షాక్ ఇచ్చాయి.. ముఖ్యంగా నందిగామలో టీడీపీ నేతలకు షాక్ తగిలినట్టు అయ్యింది.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు ఎంపీ.. అంతే కాదు.. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
Read Also: AP BRS office: ఏపీలో ప్రారంభమైన బీఆర్ఎస్ ఆఫీస్
నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ బాగా పని చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు ఎంపీ కేశినేని నాని.. నందిగామలో అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.. ఎమ్మెల్యే జగన్మోహన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం పని చేస్తున్నారని కితాబిచ్చారు.. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరు అయిన అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం అని ప్రకటించారు ఎంపీ కేశినేని నాని.. చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి, వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన కేశినేని.. రాజకీయం అనేది ఎలక్షన్స్ వరకే పరిమితం అవ్వాలన్నారు.. ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ప్రజా సమస్యలపై పోరాడుతూ, అభివృద్ధిలో ముందు ఉంటారని పేర్కొన్నారు.. అభివృద్ధి కార్యక్రమంలో కలిసి పనిచేసిన టీడీపీ, వైసీపీ నాయకులకు, అధికారులకు ధన్యావాదాలు తెలిపారు.. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇదే విధంగా కలిసి పనిచేస్తే, దేశం చాలా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ఎంపీ కేశినేని నాని. అయితే, ఒకవైపు నందిగామ ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలు వసూలు బ్రదర్స్ అంటూ నందిగామ తెలుగు దేశం పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శలు గుప్పిస్తుండగా.. కేశినేని నాని మాత్రం ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది..
మరోవైపు టీడీపీ ఎంపీ కేశినేనిపై కూడా ప్రశంసలు కురిపించారు నందిగామ వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు. ఎంపీ కేశినేని నాని ప్రజా సమస్యలపై పోరాడుతూ, అభివృద్ధిలో ముందుంటారు. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం అని ప్రకశించారు.. మా నియోజకవర్గంలో ఏ పని ఉన్నా.. అడిగిన వెంటనే.. చేసి పెడుతున్నారని తెలిపారు.. టాటా ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి ఆయన అని.. ఈ సేవే ఆయనను ప్రజా నాయకుడిగా నిలబెట్టిందని ప్రశంసించారు.. ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నప్పుడే ప్రజలకు మంచి చేయగలం అని తెలిపారు ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు.