NTV Telugu Site icon

MP K.Laxman : బీసీల ప్రయోజనాలను నెహ్రూ ఫ్యామిలీ అణచివేసింది

Laxman

Laxman

నెహ్రూ నుండి మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు ఓబీసీ లకి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా మోడీ కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని ఎండగట్టారన్నారు. బీసీల ప్రయోజనాలను నెహ్రూ ఫ్యామిలీ అణచివేసిందని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రశ్నలకి రాహుల్ గాంధీ తో సహా ఎవరు సమాధానం చెప్పలేదని, కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీ ఓట్ల కోసం తాపత్రయ పడుతున్నదన్నారు లక్ష్మణ్‌. మోడీ నీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని, కర్పూరీ ఠాకూర్,చరణ్ సింగ్, పీవీ నరసింహా రావు కి భారత రత్న ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతుందన్నారు లక్ష్మణ్‌. రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించింది చెప్పలేదని, హిందువులను ఆ పార్టీ అవమానించిందన్నారు ఎంపీ లక్ష్మణ్‌. హిందువుల ను, దేవి దేవతలను అవమంచడమే సెక్యులరిజం అని ఆ పార్టీ భావిస్తోందని ఆయన మండిపడ్డారు.

Ambajipeta Marriage Band : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

అసదుద్దీన్ అసలైన మతతత్వ వాది అని, హిందత్వం కోసం పనిచేస్తున్న ఏ వర్గాలను మోడీ ప్రభుత్వం విస్మరించలేదన్నారు లక్ష్మణ్‌. BRS కేశవ రావు కూడా అయోధ్య రామ మందిరం పై పార్లమెంట్ లో చర్చిస్తే తప్పు పడుతున్నారన్నారు. వీళ్లకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. అయోధ్య పర్యాటక, ఆధ్యాత్మిక రంగంగా వెలుగొందుతోందని అన్నారు. రాముడు, రామసేతు మిథ్య అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోందన్నారు. హిందువులను, హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదమని ఆరోపించారు. రాముడు మీద కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కిందని.. త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం హిందుత్వం కోసం పని చేస్తుందనీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక, బస్సు యాత్రలపై ఎన్నికల కమిటీ సమావేశాల్లో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎండగట్టడమే లక్ష్యంగా యాత్రలు నిర్వహిస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Bihar Floor Test: బలపరీక్షకు ముందు స్పీకర్ తొలగింపు.. ఎన్డీయేలోకి విపక్ష ఎమ్మెల్యేలు