బడ్జెట్ సమావేశాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయాలన్నారు బీజేపి ఎంపీ లక్ష్మణ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. మన తెలుగు ఆడపడుచు ఈ అమృత్ కాల్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిందని, నారీ శక్తీ, మహిళలకు సామనఅవకాశాలు మోడీ కలిపిస్తున్నారు.. అనేక రంగాలలో వారికి అవకాశాలు వస్తున్నాయన్నారు బీజేపి ఎంపీ లక్ష్మణ్. నాగాలాండ్ మొదటి సారి మహిళకు రాజస్యభ టికెట్ ఇచ్చారని, పిటి ఉషాకు మహిళకు రాజస్యభ టికెట్ ఇచ్చారని, కేసీఅర్ రాష్టం ఏర్పడిన 5 సంవత్సరాలు వరకు మహిళలను క్యాబినెట్లో కి తీసుకొనిలేదన్నారు. మహిళా అయిన గవర్నర్ ని ఎన్నో అవమానాలు చేశారని, బీఆర్ఎస్ కి మహిళలలు అంటే చిన్న చూపు అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘మోడీకి మహిళల పట్ల సముచిత స్థానం కల్పించారని, నన్ను రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగా ధన్యవాదాలు తీర్మానానికి మొదటిగా మాట్లాడడానికి అవకాశం కల్పించారని, ఈ అవకాశం కల్పించిన మోడీకి, జేపీ నడ్డాకి ధన్యవాదాలు. రైల్వేలో కేంద్ర బడ్జెట్లో 4వేల కోట్లు పైగా నిధులు కేటాయించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్ని వేల కోట్లు కేటాయించలేదు.
Also Read : Off The Record: అధినేత దృష్టిలో పడేందుకే ప్రయారిటీ..! మంత్రిపై అధిష్టానికి ఫిర్యాదులు..
అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రధానమంత్రి కోరుకుంటున్నారు.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని మోడీ లక్ష్యం. హైదరాబాదులో లక్ష ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు కేసీఆర్.. కానీ కట్టించింది 3000 ఇల్లు మాత్రమే. కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కేసీఆర్ కారణం. రైతులను కూడా మోసం చేస్తున్నారు కేసీఆర్.. ఉద్యోగాలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఏమైంది. కెసిఆర్ కుటుంబ మాత్రమే రాజకీయంగా ఎందుకు ఎదుగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది మేధావులు విద్యార్థులు ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తప్పకుండా ప్రయత్నం చేస్తాను.’ అని బీజేపి ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Also Read : Off The Record: మాజీ ఎంపీ పొంగులేటి ఏ పార్టీలో చేరతారు? ఆ ప్రచారంలో నిజమెంత?
