కేంద్రమంత్రి రేసులో ఉన్నారా అని ప్రశ్నపై స్పందించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రధానమంత్రి ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది నిర్వహిస్తాని ఆయన తెలిపారు. నేను ఎప్పుడూ రేసులో ఉండను.. ఎవరికీ ఎం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వచ్చాయన్న వ్యాఖ్యలపై స్పందించిన లక్ష్మణ్.. రేవంత్ వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్‌కి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు 8 సీట్లు గెలిచిందని ఆయన వెల్లడించారు. 6 నెలలలో 15 కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కనబరిచిందని, అవినీతి అంశాలు తెరమీడికి తెచ్చి బీఆర్ఎస్ నాయకులతో కాంగ్రెస్ బేరసారాలు చేస్తుందన్నారు లక్ష్మణ్. లిక్కర్ స్కామ్ సందర్భంగా బీజేపీపై దుష్ప్రచారం చేసిందని, రేవంత్ రెడ్డి మాటల గరాడితో ప్రజాలను మభ్య పెడుతున్నారని ఆయన అన్నారు. తప్పు చేశారు కాబట్టే లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారని, బీజేపీని నిలువరించాలని మోడీ ప్రధాని కాకుండా చేయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం చేసుకుని పనిచేసారన్నారు.
Annamalai: మేకకు అన్నామలై ఫోటో తగిలించి, నడిరోడ్డుపై తలనరికి డీఎంకే సంబరాలు.. వీడియో వైరల్..
అంతేకాకుండా.. ‘తన పాలనకు రెఫరెండం అన్న రేవంత్ 8 లోక్ సభ స్థానాలు మాత్రమే గెలిచారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల దృష్టి మార్చేందుకు తెలంగాణ తల్లి ఉత్సవాలు అంటున్నారు. సోనియాగాంధీ తెలంగాణ తల్లినా తెలంగాణ బలిదేవతనా ! రైతు భరోసా లేదు..రైతు రుణ మాఫీ లేదు. ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు లోక్ సభ గెలిచాం రేపు అసెంబ్లీ చేజిక్కించుకుంటాం. తెలంగాణలో బీజేపీ 35 శాతం ఓట్లు సాధించింది. తెలంగాణ లో బీఆర్ఎస్ ను బొంద పెట్టారు. తెలంగాణ లో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం. ఇక కాంగ్రెస్ లో విలీనం కావడమే మిగిలి ఉంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Criminal Cases On MP: వామ్మో.. కొత్తగా ఎన్నికైన ఎంపీలలో అంతమందిపై క్రిమినల్ కేసులు..
