MP K.Laxman : మునుగోడు సభలో కేసీఆర్ ఓటమి కన్పించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP K.Laxman Criticized CM KCR
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం చుట్టు తిరుగుతోంది. అయితే.. మనుగోడు ప్రజాదీవెన పేరిటి టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పందిస్తూ.. మునుగోడు సభలో కేసీఆర్ ఓటమి కన్పించిందన్నారు. ‘మోదీ, అమిత్ షాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మునుగోడు బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బాధ్యతారహితంగా మాట్లాడారు. దేశ ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంశాఖ మాత్యులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతోందనే భావన కేసీఆర్ లో కలిగినందువల్లే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోంది. రైతులు, యువకులను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ ఎంతగానో ప్రయత్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ కేసీఆర్ రైతులను భయపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అపోహలను తొలగించింది. అయినా కూడా కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు కేసీఆర్ పదేపదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కేంద్ర మంత్రిపై లేనిపోని అభాండాలు వేయడం శోచనీయం. ఆసరా పెన్షన్ల విషయంలో కేంద్ర మంత్రి చెప్పని విషయాలను ఆయనకు ఆపాదించడం సిగ్గు చేటు.
Also Read
- Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌పై మళ్లీ చర్చ..!
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
- Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
మునుగోడు ఓటర్లను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ఎన్నో అబద్దాలాడారు. అందులో ముఖ్యమైనది సకాలంలో వర్షాలు పడి ధాన్యం దిగుబడి పెరిగితే… తాను నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే పంట దిగుబడి పెరిగినట్లు చెప్పడం హాస్యాస్పదం. ధాన్యం కొనబోమని కేంద్రం ఏనాడూ చెప్పలేదు. అయినా తన వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టేసే ప్రయత్నం చేయడం విడ్డూరం. తాను రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించాలనుకోవడం దారుణం.కానీ తెలంగాణ రైతులకు వాస్తవాలు తెలుసు. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎరువుల పేరిట దేశవ్యాప్తంగా ఏటా రూ. 2 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు. వ్యవసాయ యంత్రాల మీద కేంద్రం సబ్సిడీ ఇస్తుంటే… మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక రైతులకు వాటిని అందకుండా చేశారు. ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడంవల్ల భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు సాయం అందకుండా చేసిన దుర్మార్గుడు కేసీఆర్. గత 8 ఏండ్లుగా ఉద్యోగాలివ్వకుండా, మూడేళ్లుగా నిరుద్యోగ భ్రుతి ఇవ్వకుండా యువతను మోసం చేసిన కేసీఆర్ ను మునుగోడు బిడ్డలు బండకేసి బాదడం ఖాయం. కేసీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి ఖాయం… బీజేపీ గెలుపు తథ్యం’ అని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
Fauzi premieres : వరల్డ్ వైడ్‌గా ఒకరోజు ముందుగానే ‘ఫౌజీ’ ప్రీమియర్స్.. కన్ఫామ్ చేసిన మైత్రి రవి
-
Suriya-Jyothika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా వస్తారా?.. వైరల్ అవుతున్న సూర్య, జ్యోతిక ఫోటోషూట్!
-
Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌పై మళ్లీ చర్చ..!
-
Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
-
Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!